పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్​పర్ట్​ల నియామకం - ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 12:37 PM IST

thumbnail

Future Skill Expert Programme in AP Govt Schools : రాష్ట్రంలోని మ్యాపింగ్ చేసిన 6790 ఉన్నత పాఠశాలలో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్​పర్ట్​ల నియామకం కోసం పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు పాఠశాలల కు ఒకరు చొప్పున ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ లు, స్మార్ట్ టివి సహా ఇతర డిజిటల్ పరికరాల నిర్వహణ, వినియోగం, బోధన కోసం ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్​పర్ట్​లను నియమించాలని ప్రభుత్వ నిర్ణయించింది. 

ఎంటెక్ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్ మూడో ఏడాది పూర్తి చేసిన వారికి ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్​పర్ట్ (Future Skills Expert) గా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. వీరికి నెలకు 12 వేల వేతనం, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి పాఠశాల వరకు కిలోమీటర్ కు రూ.2 చొప్పున రవాణా చార్జి చెల్లించాలని నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.