సిమెంట్‌ ఫ్యాక్టరీ సమీపంలో అగ్ని కీలలు - పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 12:43 PM IST

thumbnail

Fire Accident at Dalmia Cement Dumping Yard: దాల్మియా సిమెంట్‌ కర్మాగారానికి(Dalmia Cement Factory) సంబంధించిన డంపింగ్‌ యార్డు(Dumping Yard)లో ఈరోజు అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, అగ్నిమాపక అధికారి తెలిపిన వివరాల ప్రకారం వైఎస్సార్‌ జిల్లా మైలవరం మండలం చిన్నకొమ్మర్ల సమీపంలో ఉన్న దాల్మియా సిమెంట్‌ కర్మాగారానికి సమీపంలో ఉన్న డంపింగ్‌ యార్డులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

మంటలను అదుపులోకి తెచ్చేందుకు జమ్మలమడుగు, మైదుకూరు నుంచి అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన డంపింగ్‌ యార్డుకు చేరుకున్నాయి. సిమెంటు పరిశ్రమ సమీపంలోనే ఈ అగ్నిప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ప్రమాదంలో అగ్ని కీలలు భారీగా ఎగిసి పడడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.