నకిలీ విత్తనాలతో మోసం చేశారంటూ రైతులు ఆగ్రహాం
Farmers Angry They Cheated Fake Onion Seeds 150 Acres Crop Loss: వైఎస్సార్ జిల్లా వీరపునాయుని పల్లె మండలం పాయసంపల్లె రైతు భరోసాకేంద్రం వద్ద రైతులు ఆందోళన చేశారు. ఫెర్టిలైజర్ దుకాణం దారులు పంచగంగా కంపెనీకి చెందిన నకిలీ ఉల్లి విత్తనాలు ఇచ్చి మోసం చేశారంటూ రైతులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పులివెందులకు చెందిన సమరసింహారెడ్డి, అనంతపురానికి చెందిన గురు బాలాజీ అవని సీడ్స్ వారి నకిలీ ఉల్లి విత్తనాలు ఇచ్చి అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకుని మంచి దిగుబడిని ఇస్తుందని అని చెప్పి మోసం చేశారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 30 వేల రూపాయల చొప్పున ఖర్చు చేశామని వారు వెల్లడించారు. ఆ విత్తనాలతో మొలకవచ్చి చనిపోవడంతో తాము ఇప్పుడు ఎం చేయాలో అర్ధం కావడం లేదని రైతులు వాపోతున్నారు.
సుమారు 20 రోజులుగా పంచగంగా ప్రతినిధికి ఈ విషయం తెలియజేస్తున్న పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పులివెందుల చుట్టు పక్కల 15 కిలోమీటర్లలో వేసిన ఉల్లి విత్తనాలన్నీ చనిపోయాయని, ఇందుకు గల కారణాలను వ్యవసాయ అధికారులనే అడిగితే చెబుతారని.. సీడ్స్ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు తయారుచేసిన కంపెనీలను అవి అమ్మే వ్యాపారస్తులపైన చర్యలు తీసుకొని తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.