Cows Fighting on The Road in Uravakonda: కొమ్ములతో పొడుచుకుంటూ రోడ్డుపైకి వచ్చిన ఆవులు.. భయాందోళనలో ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 11:46 AM IST

thumbnail

Cows Fighting on The Road in Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రెండు ఆవులు మధ్య జరిగిన భీకర పోరు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఉరవకొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఒకసారిగా రెండు ఆవులు కొమ్ములతో పొడుచుకుంటూ వేగంగా రోడ్డుపైకి దూసుకురావడంతో అక్కడ ఉన్న ప్రజలు, ఆటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తం అయిన స్థానికులు దాదాపు 15 నిమిషాల పాటు శ్రమించి ఆ ఆవులను చెదరగొట్టారు. పట్టణంలో చాలా చోట్ల పశువులు రోడ్లపై గుంపులుగా సంచరిస్తూ.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఇలా పశువులు రోడ్లు పైకి రావడం వల్ల ఎవరికైనా.. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అంటూ ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణంలో రోడ్ల పైకి వస్తున్న పశువులను గోశాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.