డబ్బు ఇవ్వలేదని నిప్పంటించుకున్న భర్త, ఆర్పేందుకు ప్రయత్నించిన భార్య, ఇద్దరు మృతి
Couple Died Due to Family Quarrel : డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడిలో కుటుంబ కలహాలు నేపథ్యంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. కొత్తపేట మండలం అవిడి కట్లమ్మకాలనీకి చెందిన పెదపూడి ఆదినారాయణ (42) పాత ఇనుము కొని ముగ్గు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య మంగాదేవి(35), ఇద్దరు కుమారులు ఉన్నారు.
Couple Burnt Alive in Konaseema District : మద్యానికి బానిసైన ఆదినారాయణ ఈ నెల 12వ తేదీ రాత్రి భార్యను డబ్బులు కావాలని అడగ్గా.. ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను చనిపోతానని ఇంట్లో ఉన్న పెట్రోల్ని ఒంటిపై పోసుకుని అతను నిప్పుపెట్టుకోగా మంటలు అంటుకున్నాయి. అతన్ని కాపాడేందుకు భార్య మంగాదేవి, కుమారులు ప్రయత్నించారు. మంటలు అంటుకోవడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది.
Woman Dies Trying to Save Husband in Kothapeta : తీవ్రగాయాలపాలైన ఆదినారాయణ, దుర్గాప్రసాద్, స్వల్పగాయాలపాలైన నాగరాజులను స్థానికులు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాపాలైన ఆదినారాయణ చికిత్స పొందుతూ మృతి చెందగా దుర్గాప్రసాద్, నాగరాజులు చికిత్స పొందుతున్నారు. సంఘటనా ప్రాంతాన్ని పోలీసులు సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపేట ఎస్.ఐ మణికుమార్ సోమవారం తెలిపారు.