CM Jagan Met With Governor గవర్నర్‌తో జగన్ భేటీ.. బిల్లుల ఆమోదం, ప్రస్తుత రాజకీయలపై చర్చ..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 5:36 PM IST

thumbnail

CM Jagan Met With Governor: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్​తో ముఖ్యమంత్రి జగన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు నేరుగా రాజ్ భవన్​కు వెళ్లిన సీఎం జగన్‌ కొద్దిసేపు గవర్నర్​తో భేటీ అయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చట్టం, ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ చట్టాలకు ఆమోదం తెలియచేయటంపై ఆయనకు ధన్యవాదాలు తెలియచేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపైనా గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. 

అయితే నిన్న రాష్ట్ర సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే.  స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారంటూ పిల్‌లో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఏపీ యూనైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపైన్ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్​.. గవర్నర్​తో భేటీ కావడంపై ఆసక్తిగా మారింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.