బెంగళూరు-విజయవాడ ఇండిగో విమానంలో రసాయనాల ఘాటు - ఇబ్బంది పడ్డ ప్రయాణికులు
Bangalore-Vijayawada Indigo Flight Delay: బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సిన ఇండిగో విమానం నాలుగు గంటలు ఆలస్యం అయ్యింది. ఇండిగో విమానం ఎక్కిన ప్రయాణికులకు ఒక్కసారిగా కళ్ల మంటలు, దగ్గుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానాన్ని శుభ్రం చేసే రసాయనాలను అధిక మోతాదు వాడటం వల్ల ఈ సంఘటన జరిగింది. ప్రయాణికుల సమాచారం మేరకు.. సంఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు. ప్రయాణికులను విమానంలో నుంచి దింపి వైద్య పరీక్షలు నిర్వహించారు.
బెంగళూరు నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రమానికి ... ఈ రోజు ఉదయం (నవంబరు 16) 8.10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది. విమానంలో పెద్దలతో పాటు చిన్నపిల్లలు అసౌకర్యానికి గురయ్యారు. విమానంలో పరిస్థతి సాధారణ స్థితికి వచ్చాక... బెంగుళూరులో ఇండిగో విమానం బయలుదేరింది. ఇండిగో సిబ్బందికి సమాచారం ఇచ్చిన వారు సరిగా స్పందించలేదని ప్రయాణికులు వాపోయారు. ఇదే విమానంలో.. స్త్రీలు, పిల్లలు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఉన్నారు