APSRTC Increases Accidental Insurance : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​న్యూస్.. ప్రమాద బీమా కోటీ పది లక్షలకు పెంపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2023, 1:01 PM IST

thumbnail

APSRTC Increases Accidental Insurance  : ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రమాదబీమాను పెంచున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం 45 లక్షల వరకే ఉన్న ప్రమాద బీమాను ఏకంగా కోటి పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్​బీఐతో ఆర్టీసీ రవాణ శాఖ మంత్రి సమక్షంలో కీలక ఒప్పందం చేసుకుంది.  

ఉద్యోగి ప్రమాదానికి గురైతే ఇచ్చే పరిహారం మొత్తం కోటి పది లక్షలకు పెంచింది. వీటిలో ప్రమాద బీమాను 30 నుంచి 85 లక్షలకు పెంచింది. వీటితో పాటు రూపే డెబిట్​ కార్డు ఉంటే లింకేజీ ద్వారా 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించనుంది. కొత్త రూపే కార్డు ద్వారా మరో 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్గనున్నట్లు సంస్థ తెలిపింది. సహజ మరణానికి 5 లక్షల బీమా సౌకర్యం  వర్తింప జేయనున్నారు.  మొత్తంగా ఒక కోటి రూపాయల పైగా ప్రమాద బీమా  అందనుంది.  ఈమేరకు రవాణా శాఖా మంత్రి  విశ్వరూప్ సమక్షంలో ఆర్టీసీ, ఎస్​బీఐల ఒప్పందం ఖరారైంది. ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం ఈ నిర్ణయం  తీసుకున్నట్లు  ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నిర్ణయంతో  ఆర్టీసీలోని అసోసియేషన్లు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.