జగన్ అవినీతిపై స్వయంగా ప్రధానే చెప్పిన ఎందుకు అరెస్టు చేయలేదు? : సీపీఐ నారాయణ - CPI Narayana fire on modi

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 8:17 PM IST

thumbnail
జగన్ అవినీతి గురించి స్వయంగా ప్రధానే చెప్పిన ఎందుకు అరెస్టు చేయలేదు? : సీపీఐ నారాయణ (ETV BAHRAT)

CPI National Secretary Narayana Comments On PM Modi : జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి కన్నా అవినీతే ఎక్కువగా ఉందని స్వయంగా నరేంద్ర మోదీనే వెల్లడించినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఆధారాలు లేకుండా ప్రధాని స్థాయి వ్యక్తి అలా మాట్లాడరన్నారు. దేశ ప్రధానే చెప్పిన తరువాత జగన్​ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ నిజంగా చిత్తశుద్ధితో మాట్లాడి ఉంటే జగన్ మోహాన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. విజయవాడ దాసరి భవన్​లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు ఎక్కడ సీన్​లో ఉండరని విమర్శించారు. వారిని అడ్డంపెట్టుకొని బీజేపీ పెత్తనం చెలాయిస్తుందని వెల్లడించారు. మహారాష్ట్రలో శక్తివంతమైన శరద్ పవార్ పార్టీని, శివసేన పార్టీని చీల్చేసి షిండే లాంటి వారిని తెచ్చుకున్నారని గుర్తుచేశారు. అటువంటి షిండేలు ఇక్కడ కూడా ఉన్నారని తెలిపారు. టీడీపీ, వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ రాదనీ, హంగ్ వస్తుందని వెల్లడించారు. అప్పుడు అసలు బండారం బయటపడుతుందని నారాయణ విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.