మీకు నచ్చినవారికే ఓటు వేసుకోండి- యువకుల నిలదీతతో వెనుదిరిగిన వైసీపీ నేతలు - Protest to YSRCP leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 9:06 PM IST

thumbnail
సత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులకు నిరసన సెగ- ప్రచారానికి రావొద్దని అడ్డుకున్న యువకులు (ETV Bharat)

Protest to YSRCP leaders in Election Campaign: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాలో వైఎస్సార్సీపీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో స్థానిక సమస్యలపై వైఎస్సార్సీపీ నాయకులను యువకులు నిలదీశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఐదేళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చారని, ఆ తర్వాత ఇంత వరకూ తమ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదని యువకులు మండిపడ్డారు. మరోసారి శ్రీధర్ రెడ్డిని గెలిపిస్తే గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తామని వైఎస్సార్సీపీ నాయకులు చెప్పినా యువకులు వారి మాట వినలేదు. సమస్యలు పరిష్కరించే వరకు తమ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి రావద్దని యువకులు తేల్చి చెప్పారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు చేసేదేమి లేక మీకు నచ్చిన వారికి ఓట్లు వేసుకోండి అంటూ అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.