మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమైన ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 10:57 PM IST

thumbnail

AP Government Discussions with Trade Unions : మున్సిపల్​ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. ఈ క్రమంలో కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చలు జరపనున్నారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం నిర్వహించిన మొదటి దఫా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కార్మికులతో రెండోసారి చర్చలకు పూనుకుంది.

తమ డిమాండ్లను పరిష్కరించాలని గత 7 రోజులుగా మున్సిపల్​ కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కరోనా విజృంభణతో పాటు ఇతర అంటురోగాల పెరుగుదల ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకువస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్​ సహా ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గోనున్నారు. మరోవైపు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్సు కింద 6 వేల రూపాయలను డ్రైనేజీ కార్మికులకు, శానిటేషన్ వాహనాల డ్రైవర్లకు, మలేరియా వర్కర్కకు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.