ఫ్యాషన్ షోలో శ్రీ'మతి' పోగొట్టారుగా! ర్యాంప్ వాక్ సోయగాలు చూడాలంటే రెండుకళ్లు చాలవంతే!
Amaravati Fashion Show in Vijayawada: విజయవాడలో జరిగిన శ్రీమతి అమరావతి ఫ్యాషన్ షో వీక్షకులను అలరించింది. విజయవాడ నోవాటెల్ హోటల్లో ఈ 8వ వార్షికోత్సవ ఫ్యాషన్ షో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సినీ నిర్మాత అంబికా కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 2023 ట్రెడిషనల్ ఫ్యాషన్ షో గ్రాండ్ ఫైనల్‌లో సుందరీమణులు తళుక్కుమన్నారు. సంప్రదాయ దస్తులు ధరించి స్టేజ్‌పై ర్యాంప్ వాక్ చేశారు.
Ishachawla and Subhasree Ramp Walk with Women: ఈ ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలో ముద్దుగుమ్మలు నడకలతో హొయలొలికించారు. ఆటపాటలకు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఈ ఫ్యాషన్ షో కార్యక్రమానికి సీనీనటులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన సినీనటి ఇషా చావ్లా మహిళలతో ర్యాంప్ చేసి ఉత్సాహపరిచారు. బిగ్ బాస్ ఫేమ్ సుభశ్రీ, మానస్, అన్వేషి సినిమా టీమ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫ్యాషన్ షో లో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.