Amaravati Capital Farmers Agitation On Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2023, 4:28 PM IST

Updated : Sep 10, 2023, 4:37 PM IST

thumbnail

Amaravati Capital Farmers Agitation On Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత నారా  చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ.. రాజధాని ప్రాంతంలో మహిళలు, రైతులు నిరసన తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును విడుదల చేయాలంటూ.. మందడంలో రైతులు రోడ్డెక్కారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఆరోపించారు. కేవలం చంద్రబాబుపై ఉన్న కక్షతోనే కేసులు పెట్టి వేదించే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. 

 అమరావతి రూపశిల్పిపై అక్రమంగా అవినీతిని అంటగడుతున్నారని రైతులు ఆరోపించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తుళ్లూరులో రైతులు సామూహిక నిరాహార దీక్షకు దిగారు. చంద్రబాబును అరెస్టు చేసి జగన్  ప్రభుత్వం పైశాచిక అనందం పొందుతోందని రైతులు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఇకనైనా  కక్షసాధింపు చర్యలు మానుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లద్వారా సమాధానం చెబుతారని పేర్కొన్నారు. చంద్రబాబుకు రాజధాని ప్రాంత ప్రజల మద్ధతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.  

Last Updated : Sep 10, 2023, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.