ETV Bharat / state

YSRCP Government Neglect the Horticultural Crops: ఉద్యాన పంటల్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం..తీవ్రంగా నష్టపోతున్న రైతులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 7:20 AM IST

Updated : Oct 13, 2023, 8:20 AM IST

YSRCP Government Neglect the Horticultural Crops : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమం అనేది ముఖ్యమంత్రి జగన్‌ తన మాటల్లో ఊదరగొట్టడం తప్పితే.. నిజంగా ఒరిగిందేమి లేదు. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం కొరవడింది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 నుంచి 2018-19 వరకు టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఇచ్చిన ప్రోత్సాహంతో ఉద్యాన పంటల ఉత్పత్తి 1.69 కోట్ల టన్నుల నుంచి 3.05కోట్ల టన్నులకు పెరిగింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితంగా 2019-20 సంవత్సరంలో ఉద్యాన పంటల ఉత్పత్తి 3.12 కోట్ల టన్నులు ఉండగా.. 2021-22 నాటికి 2.66 కోట్ల టన్నులకు పడిపోయింది. ఉత్పత్తి పెరగకపోగా.. 15% తగ్గింది. ఈ గణంకాలను పరిశీలిస్తే చాలు జగన్‌ ఉద్యాన రైతుల్ని ఒరగబెట్టిందేమిటో ఇట్టే అర్థమవుతోంది.

ysrcp_government_neglect_the_horticultural_crops
ysrcp_government_neglect_the_horticultural_crops

YSRCP Government Neglect the Horticultural Crops: ఉద్యాన పంటల్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం..తీవ్రంగా నష్టపోతున్న రైతులు

YSRCP Government Neglect the Horticultural Crops : వైఎస్సార్సీపీ పాలనలో రైతు సంక్షేమం అనేది ముఖ్యమంత్రి జగన్‌ మాటల్లో తప్పితే.. నిజంగా ఒరిగేదేమీ లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు జగన్‌ ప్రభుత్వంలో ప్రోత్సాహమే కొరవడింది. 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిందే తడవుగా.. రక్షిత సేద్యం పందిరి సాగు సహా సాగుకిచ్చే రాయితీలను నిలిపేసింది. సూక్ష్మసేద్యం పథకాన్ని (Micro Irrigation Scheme in AP) అటకెక్కించి తీవ్ర ఇబ్బందులు పెట్టింది.

Farmers Huge Loss in Jagan Government : ఉద్యాన పంటల సాగులో దేశంలోనే అగ్రస్థానంలోకి దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ను.. కావాలనే పడదోసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధికారం చేపట్టాక పని లేని శాఖగా తయారైంది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యాన పంటల ఉత్పత్తి 1.36 కోట్ల టన్నులు పెరగ్గా.. వైఎస్సార్సీపీ వచ్చాక 2019-20 నాటితో పోలిస్తే 46లక్షల టన్నులు తగ్గడమే దీనికి నిదర్శనం. పండ్ల తోటలు, కూరగాయ పంటలను చీడ పీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నా.. సలహాలు, సూచనలు ఇచ్చే పరిస్థితే కొరవడింది.

Avuku Tunnel Project Progress: ప్రతిపక్ష నేతగా గొంతెత్తిన జగన్.. అధికారం చేపట్టాక చేతులెత్తేశాడు!

రాష్ట్ర విభజన నాటి నుంచి 2019 జూన్‌ వరకు కూడా రాష్ట్రంలో ఉద్యాన పంటలకు అధిక ప్రోత్సాహం ఇచ్చారు. షేడ్‌నెట్‌ విధానంలో నారు పెంపకం, వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేసేందుకు ప్రభుత్వం విరివిగా ప్రోత్సాహించింది. అధిక బడ్జెట్‌ కేటాయించింది. పాలీహౌస్‌లో అలంకరణ పూలతో పాటు ఎగుమతి రకాల పూల సాగుకు కూడా చేయూత అందించింది. ఒక్కో రైతుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కూడా రాయితీలు అందాయి. అప్పటి అయిదేళ్లు స్వర్ణయుగమని రైతులే కాదు, అధికారులు చెబుతున్నారు. ఉద్యాన పంటల సాగుకు పలువురు ఐటీ ఉద్యోగులూ ముందుకొచ్చారు.

Rayalaseema is the Hub of Horticultural Crops : తెలుగుదేశం ప్రభుత్వ ప్రోత్సాహంతో రాయలసీమ ఉద్యాన పంటల హబ్‌గా తయారైంది. రాయితీల్ని అందిపుచ్చుకుంటూ ఎగుమతి ఆధారిత అరటి సహా, దానిమ్మ, తైవాన్‌ జామ, బొప్పాయి, ద్రాక్ష, డ్రాగన్‌ ఫ్రూట్, ఆవకడో, ఖర్జూర తదితర పంటల సాగు పెరిగింది. కోకో, ఆపిల్, మిరియాలు, బెర్రీ, ఆపిల్‌ బేర్, క్యాప్సికమ్, కుకుంబర్, జపనీస్‌ పుదీనా సహా ఆర్కిడ్స్, చామంతి, కట్‌ ఫ్లవర్స్‌తో ఉద్యానం వికసించింది. ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. జామ ఉత్పత్తి 2014-15లో లక్ష టన్నులు ఉండగా.. 2018-19 నాటికి 3.24 లక్షల టన్నులకు.. 224 శాతం వృద్ధి పెరిగింది. అరటి 34.87లక్షల టన్నుల నుంచి 62.24 లక్షల టన్నులకు పెరిగింది.

'ధాన్యం కొనుగోలుకు "ఎస్​" చెప్పండి సీయం సారూ'.. రైతుల ఆవేదన

CM Jagan Against Horticulture Farmers : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఉద్యాన రైతులపై కక్ష కట్టినట్లు సుమారు రూ.250 కోట్లకు పైగా రాయితీల విడుదలను ఒక్కసారిగా నిలిపేసింది. దీంతో అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో కొవిడ్‌ ప్రభావం మొదలు కావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. రూ.లక్షల వ్యయంతో షేడ్‌నెట్, పాలీహౌస్‌ నిర్మించుకున్న రైతులు పొలాలను తెగనమ్మి అప్పులు చెల్లించారు. కొందరు ఉద్యానసాగు నుంచి బయటకు వచ్చారు.

షేడ్‌నెట్లు, పాలీనెట్, పందిరిసేద్యం కుదేలైంది. రూ.1,000 కోట్ల సూక్ష్మసేద్య బకాయిల్ని నాలుగేళ్ల పాటు ఇవ్వకుండా సతాయించింది. మొత్తంగా ఉద్యాన పంటల ఉత్పత్తి మందగించింది. టమోటా ఉత్పత్తిలో 2017-18 సంవత్సరంలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన మన రాష్ట్రాన్ని మూడోస్థానానికి దిగజార్చిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుంది.

Horticulture Farmers Situation on YCP Govt : ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం కొరవడటంతో పాటు పంటలకు చీడ పీడలు ఆశిస్తున్నా.. పట్టించుకునే నాథుడు కరవయ్యారు. తైవాన్‌ రకం జామకు మూడేళ్లుగా పండు ఈగ ఆశించడంతో రైతులు నష్టపోతున్నారు. ఇది క్రమంగా ఇతర పంటలకూ ఆశించి నష్టపరుస్తోంది. కొబ్బరికి కూడా తెల్లదోమ ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.

బొప్పాయి, దానిమ్మ, అరటి పంటలకు కూడా చీడపీడలు ఆశించడంతో.. ఉత్పత్తిలో నాణ్యత తగ్గిపోతోంది. దీంతో రైతులకు ధరలు లభించడం లేదు. అయినా ప్రభుత్వం నివారణ చర్యలపై అవగాహన కల్పించడం లేదు. ఉద్యాన విశ్వవిద్యాలయం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Farmers problems: రైతుకి 'భరోసా' ఇవ్వని కేంద్రాలు.. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

Last Updated : Oct 13, 2023, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.