ETV Bharat / state

ప్రాణం తీసిన పూచీకత్తు.. చంపేసి పెట్రోల్​తో కాల్చేశారు.. ప్రశ్నించాడని వైసీపీ సర్పంచ్​ దాడి

author img

By

Published : Jun 4, 2023, 7:15 PM IST

7 people arrested in murder case
ప్రాణం తీసిన పూతీకత్తు.. చంపేసి పెట్రోల్​తో కాల్చారు.. ప్రశ్నించాడని వైసీపీ సర్పంచ్​ దాడి అవమానంతో

7 people arrested in murder case: వైఎస్‌ఆర్‌ జిల్లాలో అప్పు పూచీకత్తు వ్యవహారంలో స్నేహితునికి ఇచ్చిన మాటే ఓ వ్యక్తి ప్రాణం తీసింది. జూన్‌ 1న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోచోట గ్రామంలో అవినీతి అక్రమాలను నిలదీసినందుకు ఓ వ్యక్తిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో అవమానాన్ని భరించలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

7 people arrested in murder case: స్నేహితుడు తీసుకున్న డబ్బులకు చూచి పడిన పాపానికి ఓ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసి తరువాత పెట్రోలు పోసి కాల్చిన ఘటన వైఎస్సార్​ జిల్లా చింతకొమ్మదిన్నెలో చోటు చేసుకుంది. హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే పోలీసులు మృతుడిని గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఏడుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. అరెస్ట్ అయిన ఏడుగురిని కడప డీఎస్పీ షరీఫ్ మీడియా ఎదుట హాజరు పరిచారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాంత్ రెడ్డి స్నేహితుడైన సత్యనారాయణ అలియాస్ సత్యం కడపకు చెందిన చైతన్య కుమార్ రెడ్డి, శ్రీ లీల వద్ద చెరో పది లక్షల రూపాయలు చొప్పున 20 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. సత్యనారాయణ అప్పు చెల్లించకుండా తిరుగుతున్నాడు. చైతన్య కుమార్ రెడ్డి, శ్రీ లీల ఇద్దరు పలుమార్లు పంచాయతీ పెట్టారు. సత్యనారాయణ స్పందించకపోవడంతో పాలెం శ్రీకాంత్ రెడ్డి తాను పూచీకత్తు ఉంటానని ఒప్పుకున్నాడు. పూచీకత్తు ఉన్నప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో ఈనెల 1వ తేదీన చైతన్య కుమార్ రెడ్డి, శ్రీ లీలలు పూచీకత్తు ఉన్న పాలెం శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అతన్ని తీసుకొచ్చి ఓ ఇంట్లో నిర్బంధించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో చైతన్య కుమార్ రెడ్డి శ్రీ లీలతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులైన శివప్రసాద్ యాదవ్, వెంకట సాయి వారి అనుచరులు మోహన్ చంద్ర, ఉదయ్ కిరణ్, చాముండేశ్వరి కలిసి పాలెం శ్రీకాంత్ రెడ్డిని విచక్షణారహితంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి చింతకొమ్మదిన్నె మండలం సమీపంలోని బుగ్గేటి పల్లె వద్ద ఉన్న మూలవంక ముళ్ళపదల్లో పడేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న చింతకొమ్మదిన్నె పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మృతుడి వద్ద ఉన్న ఆధారాలను సేకరించి హత్య చేసిన ఏడుగురిని అరెస్టు చేశారు.

ప్రాణం తీసిన పూతీకత్తు.. చంపేసి పెట్రోల్​తో కాల్చారు..

వైసీపీ సర్పంచ్​ దాడి అవమానంతో ఆత్మహత్య.. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామంలో అవినీతి అక్రమాలను నిలదీసినందుకు శ్రీను అనే వ్యక్తిపై వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌ శోభన్‌బాబు, అతని వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దాడికి సంబంధించిన దృశ్యాల్ని గ్రామంలో వైరల్‌ చేశాడు. దీంతో అవమానాన్ని భరించలేక శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. న్యాయం జరగదని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ ప్రభుత్వసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ శ్రీను మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రశ్నించాడని వైసీపీ సర్పంచ్​ దాడి అవమానంతో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.