ETV Bharat / state

డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రిని కడతేర్చిన మైనర్ బాలుడు

author img

By

Published : Jun 3, 2023, 10:42 PM IST

Updated : Jun 4, 2023, 6:24 AM IST

Etv Bharat
Etv Bharat

AP crime News: డబ్బులు అడిగితే ఇవ్వలేదని కోపంతో కన్న తండ్రిని కర్రతో మోది అంతమొందించిన మైనర్ బాలుడి ఉదంతం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో తెల్లవారుజామున శ్రీశ్రీ కాలేజీ సమీపాన కారు బైక్ డీ కొన్న ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో విస్సన్నపేట గ్రామానికి చెందిన యువకుడు పిట్టల సాంబశివరావు (26) మృతి చెందాడు.

AP crime News: డబ్బులు అడిగితే ఇవ్వలేదని కోపంతో కన్న తండ్రిని కర్రతో మోది అంతమొందించిన మైనర్ బాలుడి ఉదంతం చిత్తూరు జిల్లా రామ కుప్పం మండలంలో చోటు చేసుకుంది. చింత కుప్పం గ్రామానికి చెందిన సుబ్రమణ్యంను రూ 500 ఇవ్వాల్సిందిగా అతని కుమారుడు (వయస్సు 17) డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో ఆగ్రహించిన కుమారుడు తండ్రి తలపై కర్రతో బలంగా మోదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సుబ్రమణ్యం అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.

కారు ఢీ కొనడంతో ఒకరు మృతి: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో తెల్లవారుజామున శ్రీశ్రీ కాలేజీ సమీపాన కారు బైక్ డీ కొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో విస్సన్నపేట గ్రామానికి చెందిన యువకుడు పిట్టల సాంబశివరావు (26) మృతి చెందాడు. అదే వాహనంపై ఉన్న ఆకుల నాగరాజు తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ హాస్పిటల్ కు తరలించారు. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

గంజాయి పట్టివేత: ఎన్టీఆర్​ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనంలో 201 కేజీ రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపు తీసుకొని.. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 4 లక్షల రూపాయలకు పైగా ఉంటుందన్నారు. ఈ గంజాయి రాజమండ్రి నుండి భోపాల్ వెళ్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని ఏసీపీ అన్నారు. బొలెరో వాహనానికి పైబాగాన ఒక అలమర అమర్చి వినూత్న పద్ధతిలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని రవాణా చేస్తుండగా మా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని ఏసీపీ జనార్దన్ నాయుడు తెలిపారు.

టీడీపీ నేతపై హత్యాయత్నం: వైయస్సార్ జిల్లా కమలాపురం మండలం జంగంపల్లెకు చెందిన జనార్థన్ రెడ్డిని వైసీపీ నేత పుత్తా నిత్యానందరెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. ద్విచక్ర వాహనంపై కమలాపురం వస్తుండగా మార్గమధ్యలో అడ్డుపడి కళ్లల్లో కారం కొట్టి హత్యాయత్నం చేయబోగా జనార్దన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. తర్వాత కమలాపురం పోలీస్ స్టేషన్ లో బాధితుడు జనార్దన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి పట్ల సాయినాథ్ శర్మ హత్యయత్నానికి పాల్పడిన నిత్యానందరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కమలాపురం పట్టణంలోని మూడు రోడ్ల కూడలిలో బైఠాయించి టీడీపీ నాయకులు కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్త జనార్దన్ రెడ్డిపై దాడి చేయడం దారుణం అన్నారు. జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నంకు పాల్పడిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని.. శిక్ష పడేలా చేయాలని కోరారు. ఇందులో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

దొంగ అరెస్ట్: రాత్రివేళ ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో నిఘా ఉంచిన పోలీసులు నిందితున్ని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి మంగళంకు చెందిన శ్రీనుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 40 లక్షలు విలువైన 793 గ్రాముల బంగారం, 1235 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలిపిరి స్టేషన్ పరిధిలో 9 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని... గతంలో పలు ప్రాంతాలలో 35 కేసులలో జైలుకు వెళ్లి వచ్చినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.

Last Updated :Jun 4, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.