ETV Bharat / state

Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. నీట మునిగిన పంటలు.. ప్రజల పాట్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 5:20 PM IST

Updated : Sep 3, 2023, 7:30 PM IST

Heavy Rains in Andhra Pradesh
Heavy Rains in Andhra Pradesh

Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కురిసిన భారీ వర్షాలు.. వందల ఎకరాల్లో పంటలకు నష్టం కలిగించాయి. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. అనేకచోట్ల రోడ్లపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉప్పొంగి పారుతున్న వాగులు, వంకలు.. పలు ప్రమాదాలకు కారణమయ్యాయి.

Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. నీట మునిగిన పంటలు.. ప్రజల పాట్లు

Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రవాప్తంగా పలు చోట్ల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారు. భారీగా వస్తున్న వరద కారణంగా పలుచోట్ల వాహనాలు నీట మునిగాయి. పలువురు నీటిలో కొట్టుకుపోగా.. అతి కష్టం మీద కాపాడారు.

జలమయమైన కడప నగరం: వైఎస్సార్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీటమునిగాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, కొండాపురం మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పెద్దముడియం మండలం గుండ్లకుంట గ్రామాన్ని ఒక్కసారిగా వరద నీరు చుట్టుముట్టింది. వాగులు, వంకల ఏకం కావడంతో గ్రామం వరదలో చిక్కుకుంది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గ్రామంలో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు.

Crops Submerged in Water: మైలవరం మండలం దుగ్గనపల్లి, నవాబుపేట, చిన్నకొమ్మర్ల సహా పలు గ్రామాల్లో.. పంటలు నీట మునిగాయి. జమ్మలమడుగు మండలం ఉప్పలపాడులో సుమారు వంద ఎకరాల్లోని.. పత్తి, మిరప, కరివేపాకు పంటలు నీట మునగడంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించి.. నష్టాన్ని అంచనా వేసి సాయం చేయాలని కోరుతున్నారు.

RTC Bus Stucked Near Jammalamadugu: ఇసుక వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులను కాపాడిన పోలీసులు

వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు: జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు వద్ద.. ఇసుక వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. కర్నూలు నుంచి జమ్మలమడుగు మీదుగా ప్రొద్దుటూరు వెళ్తున్న బస్సు.. వాగులో చిక్కుకుంది. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఇసుక వాగు పొంగి పొర్లుతోంది. లోతు తెలియక డ్రైవర్‌... ఆర్టీసు బస్సును నీటిలోకి నడపడంతో.. మధ్యలోనే ఇరుక్కుపోయింది. ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకుని.. బస్సును ఒడ్డుకు చేర్చారు. డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు బస్సులోని 13 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు.

Heavy Rain in YSR District: వైఎస్సార్ జిల్లాలో సగిలేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయం గేట్లు మరమ్మతులు కారణంగా ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అట్లూరు మండలం కమలకూరు ఆనకట్టలోకి వరద నీటని మళ్లించారు. 400 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. సాయంత్రానికి అట్లూరు మండలం కమలాపురం ఆనకట్ట నిండే అవకాశం ఉంది.

Heavy Rain In Kadapa City:భారీ వర్షం.. తడిసి ముద్దైన కడప నగరం.. ఇబ్బందుల్లో ప్రజలు..

పొంగి ప్రవహిస్తున్న వాగులు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. నందికొట్కూరు, డోన్, ఆదోని, చాగలమర్రి తదితర మండలాల్లో రాత్రి వర్షం కురిసింది. చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో వక్కిలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. శెట్టివీడు వద్ద ఎర్ర వంక పొంగటంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మండలంలోని సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, మినుము, పత్తి తదితర పంటలు నీట మునిగాయి. నందికొట్కూరులోని మారుతీనగర్, హసీనా నగర్ కాలనీల్లో వర్షపు నీరు రోడ్లపై పొంగి ప్రవహించింది. ఆదోనిలో జగనన్న కాలనీ చెరువును తలపిస్తోంది.

వాగు దాటేందుకు యత్నించి.. గల్లంతు: ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. అర్ధరాత్రి సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు.. ఉప్పు వాగు ఉప్పొంగింది. కొండపేట వద్ద ప్రవహిస్తున్న ఉప్పు వాగును ద్విచక్రవాహనంపై దాటేందుకు ఇద్దరు యువకులు యత్నించి.. ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో ముళ్ల చెట్లల్లో చిక్కుకున్న ఇద్దరిని గుర్తించి.. అతికష్టం మీద కాపాడారు.

Heavy rains in Giddalur Prakasam District: ఉధ్ధృతంగా ప్రవహిస్తున్న ఉప్పు వాగు.. వరద నీటిలో చిక్కుకున్ ఫైర్ ఇంజన్

చిక్కుకున్న ఫైర్ ఇంజన్: ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల, పల్నాడు జిల్లా గుడ్లపల్లి మధ్య పెద్దవాగు ఉద్ధృత ప్రవాహంలో బైకు కొట్టుకుపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న తండ్రి, కుమార్తెను గుడ్లపల్లి గ్రామస్థులు కాపాడారు. కొండపేట రైల్వే బ్రిడ్జి వద్ద రెస్క్యూ ఆపరేషన్ కోసం వెళ్తున్న ఫైర్ ఇంజన్ చిక్కుకుంది. క్రేన్ సహాయంతో ఫైర్ ఇంజన్​ను అధికారులు వెలికితీశారు.

నీట మునిగిన పంట: అన్నమయ్య జిల్లా రాయచోటిలో అత్యధికంగా 6.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిట్వేల్‌ 66.2, వాల్మీకిపురం 6.56, బి.కొత్తకోటలో 6.48, పీలేరు 6.42, గాలివీడు 6.04, సంబేపల్లి 6.04, చిన్నమండెం 5.64, కె.వి.పల్లి 5.34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా వీరబల్లి 4.32, గుర్రంకొండ 4.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. గుంటూరు జిల్లాలో వట్టిచెరుకూరు మండలంలో భారీ వర్షం కురిసింది. వట్టిచెరుకూరు మండలంలో 8.12 సెం.మీ వర్షపాతం నమోదయింది. పలు గ్రామాల్లో వరి, మిరప, పత్తి పంట నీట మునిగింది.

Heavy Rains in Hyderabad : హైదరాబాద్​లో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇలానే

Last Updated :Sep 3, 2023, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.