ETV Bharat / state

'కరవు కనిపించడం లేదా ముఖ్యమంత్రీ'! సీఎం జగన్ సొంత జిల్లాలో రైతుల కన్నీళ్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2023, 4:24 PM IST

Chrysanthemum_Cultivation_Giving_Loss_to_Farmers
Chrysanthemum_Cultivation_Giving_Loss_to_Farmers

Chrysanthemum Cultivation Giving Loss to Farmers : వర్షాలు లేక సాగుకు తగిన నీరు అందకపోవటంతో చామంతి రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. చామంతి పంటను అత్యధికంగా సాగుచేసే వైయస్ఆర్ జిల్లాలో రైతులు ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు ఇవి. ధరలు లేకపోవడం, పూలకు తెగుళ్లు సోకడంతో రైతులే తోటను దున్నేస్తున్న దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి.

Chrysanthemum Cultivation Giving Loss to Farmers :వర్షాభావంతో వైయస్ఆర్ జిల్లాలో పంట పొలాలన్నీ దిగుబడి రాక ఎండిపోతున్న పరిస్థితులు ఒకవైపు ఉంటే.. ధరలు లేక చామంతి తోటలను దున్నేస్తున్న దుర్భిక్ష పరిస్థితులు మరోవైపు కొనసాగుతున్నాయి. కార్తికమాసంలో చామంతి పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ధరలు పడిపోవడంతో రైతులంతా చామంతి పూల తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. కిలో పది రూపాయలు కూడా పలకడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇంత దుర్భిక్షం కళ్లెదుట కనిపిస్తున్నా... ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఒక్క మండలం కూడా కరవు మండలంగా ప్రకటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

'కరవు కనిపించడం లేదా ముఖ్యమంత్రీ'! సీఎం జగన్ సొంత జిల్లాలో రైతుల కన్నీళ్లు

Chrysanthemum Flower Gardens Plowed with Tractors : పండగ సీజన్ వచ్చిందంటే పూలకు మంచి డిమాండు ఉంటుంది. ఇటీవల దసరాకు మంచి డిమాండు పలికిన చామంతి, బంతి పూలు... కార్తిక మాసంలో ప్రారంభంలోనే ధరలు పడిపోవడం రైతులను తీవ్రంగా నష్టాల్లోకి నెట్టింది. వైయస్ఆర్ జిల్లాలో కమలాపురం, పెండ్లిమర్రి, వల్లూరు, సీకేదిన్నె, ఖాజీపేట, చెన్నూరు, వీఎన్ పల్లె మండలాల్లో రైతులు అత్యధికంగా చామంతి పూల సాగు చేస్తున్నారు.

'కరవు లేదని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ.. ఆయన సొంతజిల్లాలోనే రైతులు పంటలు ఎండిపోయి... ధరలు లేక నష్టాలు చవిచూస్తుంటే కరవు కనిపించలేదా ... ప్రభుత్వం చామంతి రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి' - చామంతి పూల రైతు

Farmers Destroy Crops Loss due to Unseasonal Rainfall : జిల్లా వ్యాప్తంగా దాదాపు 6 వేల ఎకరాల్లో చామంతి సాగవుతోంది. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో కనిపించే చామంతి పూలకు మంచి డిమాండు ఉంది. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో మహిళలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తారు. జిల్లాలో పండించే చామంతి పూలను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తారు. ధరలు లేకపోవడం, పూలకు తెగుళ్లు సోకడంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు. పూలపై నల్లటి మచ్చలు, పురుగు కనిపిస్తుండటంతో ధరలు అమాంతం తగ్గిపోయాయి. వారం కిందటి వరకు కిలో చామంతి పూలు రూ.80 నుంచి 120 రూపాయలు ధర పలికింది. ప్రస్తుతం కిలో పది రూపాయలు కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.