ETV Bharat / state

YCP worker brutally murdered: కడపలో పట్టపగలే దారుణం.. కత్తులతో పొడిచి.. వైఎస్సార్​సీపీ కార్యకర్త హత్య

author img

By

Published : Jun 23, 2023, 1:25 PM IST

Updated : Jun 23, 2023, 6:51 PM IST

YCP worker
YCP worker

YSR Congress party worker was brutally murdered: వైయస్సార్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో దారుణంగా నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

YSR Congress party worker was brutally murdered: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైయస్సార్ జిల్లాలో నేడు దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అతి కిరాతంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టపగలే నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడులు చేయడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దాడి జరుగుతున్న సమయంలో ఏం చేయాలో దిక్కుతోచక భయంతో పరుగులు తీశారు.

కడపలో దారుణ ఘటన.. కడప నగరంలో ఈరోజు పట్టపగలే ఓ దారుణం ఘటన చోటుచేసుకుంది. జిమ్ చేసుకొని ఇంటికి వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీనివాస్ రెడ్డిపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు బుర్ఖాలో వచ్చి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతను అక్కిడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హూటహూటిన ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భూ తగాదాలే హత్యకు కారణం..!.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైయస్సార్ జిల్లా వల్లూరు మండలం చిన్న నాగిరెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇతనికి మరో వర్గానికి చెందిన వారితో భూ తగాదాల్లో మనస్పర్ధలు ఉన్నాయి. దానిని మనసులో పెట్టుకున్న ప్రత్యర్థి వర్గం.. కాపుకాచి, ఇవాళ ఉదయం శ్రీనివాస్ రెడ్డి కడప సంధ్య కూడలి వద్దనున్న జిమ్ములో వ్యాయామం ముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా.. నలుగురు వ్యక్తులు బుర్ఖా ధరించి, కత్తులతో అతనిపై ముక్కుమ్మడిగా దాడి చేశారు. దాడిలో భాగంగా అతన్ని విక్షణారహితంగా కత్తలతో నరికారు. దీంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతో ఆయన ఆసుపత్రికి విచ్చేసి మృతదేహాన్ని పరిశీలించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు కడప సీఐ నాగరాజు తెలిపారు.

కడపలో పట్టపగలే దారుణం.. కత్తులతో పొడిచి.. వైఎస్సార్​సీపీ కార్యకర్త హత్య

ఈ హత్య వెనక ఎవరున్నారనేది చాలా ముఖ్యం.. ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''కత్తుల దాడిలో మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి.. మల్లికార్జున రెడ్డి దగ్గర ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఈరోజు ఉదయం కడప నగరంలోని సంధ్య సర్కిల్లో జిమ్‌కి వెళ్లి తిరిగి వెళుతుండగా నలుగురు వ్యక్తులు బురకాలు ధరించి వేట కొడవలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లారు. స్థానికులు గమనించి కడప రిమ్స్‌కు తరలించలోగా మృతి చెందాడు. భూ తగాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు ఇతర కారణాలతో హత్య జరిగి ఉంటుంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించాం. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. నిందుతులను పట్టుకోవటం ముఖ్యం కాదు. ఈ హత్య వెనక ఎవరున్నారు అనేదే చాలా ముఖ్యం ఆ విషయం తెలియాల్సి ఉంది.'' అని అన్నారు.

Last Updated :Jun 23, 2023, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.