ETV Bharat / state

కడపలో ఉక్కు కర్మాగారం కాదు... కనీసం ప్రహరీనైనా నిర్మించలేదు: తులసి రెడ్డి

author img

By

Published : Nov 17, 2022, 4:39 PM IST

All Partys Round Table Conference in Kadapa: ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ కడప ప్రెస్ క్లబ్ లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మూడేళ్ల లోపు కడపలో ఉక్కు కర్మాగారాన్ని పూర్తి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం ప్రహరీ కూడా నిర్మించలేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగార నిర్మాణం కోసం సీపీఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 9 నుంచి 13 వరకు కన్యతీర్థం నుంచి కడప కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేపడతామని తెలిపారు.

tulasi reddy
tulasi reddy

All Partys Round Table Conference in AP: మూడేళ్లలోపు కడపలో ఉక్కు కర్మాగారాన్ని పూర్తి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. కనీసం ప్రహరీ కూడా నిర్మించలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు భూమి పూజ చేశారు, కానీ ఏ ఒక్కరూ కర్మాగారాన్ని నిర్మించలేదని విమర్శించారు. ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని తక్షణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్​లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

తులసి రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

రూ. 25 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కనీసం 2023 డిసెంబర్ వరకైనా ఉక్కు కర్మాగారాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే ఉక్కు కర్మాగారాన్ని చేపడతామని చెప్పారు. డిసెంబర్ 9 నుంచి 13 వరకు ఉక్కు కర్మాగార నిర్మాణం కోసం కన్యతీర్థం నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర చెప్పారు. ఈ పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరవుతారని.. అలాగే పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొంటారని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.