ETV Bharat / state

తాడేపల్లిగూడెం నిట్ స్నాతకోత్సవానికి రానున్న ఉపరాష్ట్రపతి

author img

By

Published : Dec 17, 2019, 4:42 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్​ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు నిట్ డైరెక్టర్ సీఎస్​పీ రావు తెలిపారు. డిసెంబర్ 24వ తేదీన నిట్ ప్రాంగణంలో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

vice president of india will attend thadepalligudem nit convocation
vice president of india will attend thadepalligudem nit convocation

తాడేపల్లిగూడెం నిట్ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్​ ప్రాంగణంలో డిసెంబర్ 24న నిర్వహించనున్న తొలి స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ రానున్నట్లు నిట్ డైరెక్టర్ సీఎస్​పీ రావు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వీఐపీలకు ఇబ్బంది లేకుండా నాలుగు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారని.. వెల్లడించారు. 325 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు పొందుతారని నిట్ డైరెక్టర్ వివరించారు.

ఇదీ చదవండి:

విశాఖలో ఉత్సాహంగా రోలర్​ స్కేటింగ్​ పోటీలు

Intro:..Body:పశ్చిమ గోదావరి జిల్లా
ఏపీ నిట్ తాడేపల్లిగూడెం ప్రాంగణం తొలి స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరు కాబోతున్నట్లు నిట్ డైరెక్టర్ c.s.p. రావు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన తాడేపల్లిగూడెం నిట్ ప్రాంగణంలో తొలి స్నాత్సకోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉపరాష్ట్రపతి తో పాటు గవర్నర్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ నిట్ డైరెక్టర్ డాక్టర్ సి ఎస్ పి రావు వెల్లడించారు. ఉప రాష్ట్రపతి, , గవర్నర్ పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా నాలుగు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశామన్నారు.
ఉపరాష్ట్రపతి కోసం మూడు హెలిప్యాడ్స్
గవర్నర్ కోసం ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేశామని వివరించారు. 24వ తేదీ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఉపరాష్ట్రపతి నిట్ తొలి స్నాతకోత్సవానికి హాజరవుతున్నారని తెలిపారు. గంటన్నర పాటు ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, 325 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఈ స్నాతకోత్సవంలో పట్టాల పొందుతారని నిట్ డైరెక్టర్ వివరించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు నిట్ రావడానికి కృషిచేసిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్థానిక శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ మున్సిపల్ మాజీ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఐదేళ్లగా. నిట్ తరగతులకు కళాశాలలో ఉచితంగా అందించిన వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి సత్కరించి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.
ఈ కార్యక్రమంలో నిట్ రిజిస్టర్ అంబా ప్రసాదు తదితరులు పాల్గొన్నారుConclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.