ETV Bharat / state

పోలీసుల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Nov 17, 2019, 6:59 AM IST

పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

పోలీసుల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పోలీసుల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

చేయని దొంగతనాన్ని ఆపాదించి పోలీసులు వేధిస్తున్నారంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన ఏలూరులోని దొంగల మండపం వీధి సమీపంలో ఓ మహిళ దేవాలయానికి వెళ్ళొస్తుండగా ఓ అగంతకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించుకుపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... లంకపల్లి సాత్విక రాజు, అతని స్నేహితులు నవీన్‌ తేజ, ప్రేమ్‌కుమార్‌ అనే ముగ్గురు డిగ్రీ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న మొదటి పట్టణ సీఐ బాల రాజాజీ పలు దఫాలుగా వారిని విచారించి పంపించేశాడు. ఈనెల 16సాయంత్రానికి ఏ విషయం తేల్చకపోతే కేసుపెట్టి అరెస్టు చేస్తామని బెదిరించాడని... మనస్థాపానికి గురైన సాత్వికరాజు ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: మెడికల్​ దుకాణాలపై విజిలెన్స్​ అధికారుల దాడులు

Intro:AP_TPG_10_16_STUDENT_SUCIDE_ATEMPT_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) పోలీసులు వేధింపులతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


Body:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కత్తేపువీధికి చెందిన లంకపల్లి సాత్విక రాజు డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 2వ తేదీన ఏలూరులోని దొంగల మండపం వీధి సమీపంలో మహిళా దేవాలయానికి వెళ్ళి వస్తుండగా ఓ అగంతకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీన్ని భాగంగానే లంకపల్లి సాత్విక రాజును, అదే కాలనీకి చెందిన తన స్నేహితులు నవీన్ తేజ ప్రేమ్ కుమార్ లను పోలీసులు ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. వీరిపై అనుమానం వచ్చి సీఐ బాల రాజాజీ దపదపాలు గా విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. రెండు మూడు రోజులు స్టేషన్ వద్దే ఉంచారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈనెల 16వ తేదీన కూడా అదుపులోకి తీసుకుని విచారించారు .16వ తేదీ సాయంత్రానికి ఏ విషయం తేల్చక పోతే కేసు కట్టి అరెస్టు చేస్తామని బెదిరించినట్లు చెబుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన సాత్విక రాజు తన ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ప్రభుత్వం చికిత్స పొందుతున్నాడు. చదువుకుంటున్న తమ పిల్లవాడిని అనుమానం పేరుతో పలుమార్లు విచారించి బెదిరింపులు చేయడంతోనే తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


Conclusion:బైట్. సత్యవతి , బాధితుడు తల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.