ETV Bharat / state

మెడికల్​ దుకాణాలపై విజిలెన్స్​ అధికారుల దాడులు

author img

By

Published : Nov 16, 2019, 12:09 PM IST

Updated : Nov 16, 2019, 12:34 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని మెడికల్​ దుకాణాల్లో విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్​ ఔషధ నియంత్రణ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కాలపరిమితి తీరిన మందులు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏలూరులోని సాయి గాయత్రి మెడికల్ ఆకస్మిక తనిఖీ

మెడికల్​ దుకాణాల్లో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మెడికల్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఒక దుకాణంలో కాలపరిమితి తీరిన మందులు నిల్వ ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల దుకాణంలో ఫార్మసిస్ట్ ఉండాల్సి ఉండగా.. స్వయంగా దుకాణం యజమానులే మందుల చీటీలు చూసి వినియోగదారులకు మందులను ఇస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎస్​ఐ ఏసుబాబు, ఔషధ నియంత్రణ తనిఖీ అధికారి వీర కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ విప్ ఆకస్మిక తనిఖీ

Intro:AP_TPG_07_15_MEDICLES_SHOPS_DADI_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మందుల షాపులపై దాడులు నిర్వహించారు.


Body:ఏలూరులోని సాయి గాయత్రి మెడికల్ దుకాణంపై ఆ శాఖల అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అధికారుల పరిశీలన 93రకాల కాలపరిమితి చెందిన ఔషదాలు గుర్తించారు. ఒకే దుకాణంలో ఇంతటి స్థాయికి కాలపరిమితి తీరిన ఔషధాలు నిల్వ ఉంచడం పట్ల అధికారులు విస్మయం చెందారు. మందుల దుకాణంలో ఫార్మసిస్ట్ ఉండాల్సి ఉండగా స్వయంగా దుకాణం యజమానులే మందుల చీటీలు చూసి వినియోగదారులకు మందులను ఇస్తుండడం గుర్తించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తహసిల్దార్ రవి కుమార్ మాట్లాడుతూ దుకాణం యజమాని నిబంధనలను పూర్తిగా అతిక్రమించి నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన 93 రకాల కాలపరిమితి తీరిన ఔషధాలు విలువ రూ.15,609 ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎస్ ఐ ఏసుబాబు, ఔషధ నియంత్రణ తనిఖీ అధికారి వీర కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


Conclusion:బైట్. రవికుమార్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తహసిల్దార్
Last Updated : Nov 16, 2019, 12:34 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.