ETV Bharat / state

TDP Bus Yatra: పశ్చిమ గోదావరి జిల్లాలో కోలాహలంగా చైతన్య రథ యాత్ర.. భారీగా హాజరైన కార్యకర్తలు..

author img

By

Published : Jul 16, 2023, 12:19 PM IST

TDP Bus Yatra
భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య బస్సుయాత్ర

TDP Bus Yatra: టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య బస్సుయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో నిర్వహించిన చైతన్య రథ యాత్ర ఉత్సాహంగా సాగింది.

TDP Leaders Bus Yatra: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య బస్సుయాత్ర కోలాహలంగా సాగింది. శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు.. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నరసాపురంలో ప్రదర్శన ప్రారంభించారు. అంబేడ్కర్‌ కూడలి నుంచి పాతబజారు, పంజా సెంటరు వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు హారతులు, పుష్పాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి మిషన్‌ హైస్కూలు, జగన్నాథస్వామి ఆలయం, కరణంగారివీధి నుంచి 216 జాతీయ రహదారి వరకూ వాహన ప్రదర్శన చేశారు.

TDP Bus Yatra: విజయవంతంగా దూసుకుపోతున్న టీడీపీ బస్సు యాత్ర.. భారీగా తరలివస్తున్న ప్రజలు

అనంతరం సీతారామపురం మీదుగా మొగల్తూరు చేరుకున్నారు. బస్సు యాత్ర నేపథ్యంలో నరసాపురం పసుపుమయమైంది. నియోజకవర్గంలోని పట్టణం, గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన పసుపు దండుతో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో సైకోపాలనకు చరమగీతం పాడి చంద్రబాబు సారధ్యంలోని సైకిల్‌పాలన వచ్చేందుకు కృషి చేయాలని టీడీపీ నాయకులు సూచించారు. భవిష్యత్తుకు భరోసా బస్సుయాత్రలో భాగంగా శనివారం మొగల్తూరు గాంధీబొమ్మ కూడలిలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్సీ రామమోహన్‌, నియోజకవర్గ పరిశీలకులు గుత్తుల సాయి, పార్టీ నాయకుడు బర్రె ప్రసాద్‌, ముత్యాల రత్నం, కోళ్ల నాగేశ్వరరావు, వలవల బాజ్జీ తదితరులు పాల్గొన్నారు.

TDP Bus Yatra భవిష్యత్తుకు గ్యారెంటీ సభలకు విశేష స్పందన.. ఉత్సాహంగా టీడీపీ నేతల బస్సుయాత్రలు..

ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ నేతలు ఏమన్నారంటే..
"వైఎస్సార్​సీపీ సర్కారు.. వాలంటీరు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటుంది. రూ.50 ధర ఉండే మద్యం సీసా రూ.200 చేశారు. అందులో రూ.150 జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్తోంది." - పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి

"సీఎం జగన్ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. విద్యుత్తు ఛార్జీలు మూడు రెట్లు పెంచారు. ఇలా అన్నిరంగాల్లో ముఖ్యమంత్రి విఫలమయ్యారు. ఓటర్ల జాబితాల్లో మోసాలు జరుగుతాయి. బూత్‌, క్లస్టర్ల కన్వీనర్లు వాటి నిరోధానికి కృషి చేయాలి." - నిమ్మకాలయ చినరాజప్ప, మాజీ హోంమంత్రి

"వైఎస్సార్​సీపీ పాలనలో అమరావతిని అటకెక్కించారు. పోలవరాన్ని ముంచేశారు. 2014-19లో ఆక్వా ఏ రకంగా ఉంది. ప్రస్తుతం ఏ రకంగా ఉందో ప్రజలు తెలుసుకోవాలి. పదివేల రూపాయలువిద్యుత్ బిల్లు వచ్చే రైతులకు ప్రస్తుతం యాభై వేలు వస్తోంది." - నిమ్మల రామానాయుడు, పాలకొల్లు శాసనసభ్యుడు

"దుర్మార్గపాలన అంతమొందించాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రచారాన్ని కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లాలంటే బూత్‌ కమిటీలు, ఇతర కమిటీలన్నింటికీ బాధ్యతాయుతమైన వారిని ఎంపిక చేయాలి." - జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే

"టీడీపీ హయాంలోనే తీరప్రాంతం అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆసుపత్రి, బస్టాండు కట్టామని గొప్పలు చెప్తున్నారు. కానీ హాస్పిటల్లో వైద్యులు లేరు. హార్బరు, గోదావరిపై వంతెన, ఫిషరీష్‌ యూనివర్సిటీ కడతామని వైసీపీ సర్కారు ప్రగల్భాలు చెప్పింది. అయితే అవేమీ జరగలేదు." - ఎంఏ షరీఫ్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు

"ఎస్సీ, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏ రహదారులు నిర్మించారో చెప్పాలి. అమ్మఒడి పేరుతో బురిడీ కొట్టించి నాన్నబుడ్డితో రూ.96 వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు." - పీతల సుజాత, మాజీమంత్రి

TDP Bus Yatra: భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రతో.. వైసీపీ వెన్నులో వణుకు..: టీడీపీ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.