ETV Bharat / state

స్నేహితుణ్ని హతమార్చిన వాలంటీరు అరెస్టు

author img

By

Published : Oct 27, 2022, 6:13 PM IST

Updated : Oct 28, 2022, 8:48 AM IST

Murder of young man: తాను ప్రేమించిన అమ్మయితో ఫోన్లో మాట్లాడుతున్నాడంటూ.. ఓ యువకుడిని అతని స్నేహితుడే హత్యచేశాడు. విజయనగరంలోని కేఎల్ పురం సమీపంలో రైల్వే ట్రాక్‌ వద్ద రెండు రోజుల క్రితం.. ఓ యువకుడి మృతదేహం గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Murder of young man
యువకుడి హత్య.

విజయనగరంలో కేఎల్‌పురం సమీపంలో హత్య

Youngman Murder: తన ప్రేమ వ్యవహారానికి అడ్డు తగులుతున్నాడనే కారణంతో స్నేహితుణ్ని హత్య చేసి.. రైలు ప్రమాదంగా చిత్రీకరించిన వాలంటీరు చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. డీఎస్పీ టి.త్రినాథ్‌ గురువారం ఈ వివరాలను వెల్లడించారు. స్థానిక బీసీ కాలనీకి చెందిన బి.బ్రహ్మాజీ (బాలు) డిగ్రీ పూర్తిచేసి వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అతడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెతో మాట్లాడేందుకు టి.నవీన్‌(19) అనే స్నేహితుడి ఫోన్‌ వాడేవాడు. అతడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

బాలు మాట్లాడి వెళ్లిపోయాక.. నవీన్‌ తాను కాల్‌ చేసి ఆమెతో మాట్లాడేవాడు. ఈ విషయం బాలుకు తెలియడంతో హెచ్చరించాడు. అందుకు నవీన్‌.. ‘వాలంటీరు పేరుతో నువ్వు చేసే పాపాలతో పోలిస్తే నేను చేసే దాంట్లో తప్పేం లేదు’ అంటూ ఎదురు దాడి ప్రారంభించాడు. ‘సంక్షేమ పథకాలు, పింఛన్ల పేరుతో వాలంటీరు ముసుగులో కొందరు అమ్మాయిలు, మహిళల జీవితాలతో ఆడుకున్న నువ్వా చెప్పేది? నీ అవసరాలు, ఎదుగుదల కోసం కొందరు యువకులను మత్తుకు బానిసల్ని చేశావు.. అవన్నీ బయట పెడతా’ అని హెచ్చరించడంతో ఇద్దరి మధ్య వైరం ముదిరింది.

నవీన్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్న బాలు ఈ నెల 24న రాత్రి మద్యం తాగుదామంటూ రైల్వే ట్రాక్‌ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. బాలు కర్రతో నవీన్‌ తలపై మోది హతమార్చాడు. శవాన్ని పక్కన కాలువలో పడేసి పరారయ్యాడు. రైలు ఢీకొని చనిపోయినట్లు అందరినీ నమ్మించి అంత్యక్రియలు వెంటనే చేయాలని తొందరపెట్టాడు. మృతదేహం పడి ఉన్న తీరు చూసిన రైల్వే పోలీసులు ఇది ప్రమాదం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి ఒంటిమీద దెబ్బలు చూసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయటపడింది. ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ నాలుగు బృందాలను నియమించారు. బాలును అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం అంగీకరించాడు. అతడిని రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 28, 2022, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.