ETV Bharat / state

రామతీర్థంలో సిట్ పర్యటన.. దర్యాప్తు పురోగతిపై ఆరా

author img

By

Published : Jan 16, 2021, 9:37 PM IST

Updated : Jan 17, 2021, 6:27 AM IST

sit investigation in ramateertham
రామతీర్థంలో దర్యాప్తు చేస్తున్న సిట్ సభ్యులు

రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం కేసు దర్యాప్తునకు ప్రభుత్వం నియమించిన సిట్.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ఆలయం వద్ద ఈరోజు పర్యటించింది. విగ్రహం, పరిసరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు విషయమై ఇతర సిబ్బందితో.. జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు.

విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని దేవాలయంలో స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటనపై దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని సిట్‌ చీఫ్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఆలయాన్ని సిట్‌ బృంద సభ్యులతో కలిసి ఆయన సందర్శించారు. ధ్వంసమైన విగ్రహం, ఆలయ పరిసరాలు, ఖండిత విగ్రహ శిరస్సు లభించిన రామకోనేరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. మరిన్ని వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో సీఐడీ, పోలీసు అధికారులు, క్రైమ్‌ పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. కేసు దర్యాప్తును సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఇటీవల దేవాలయాల్లో ఒకే తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో వీటన్నింటికి ఏదైనా ఒకే కారణం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, స్థానిక పోలీసుల సహకారంతో కేసును ఛేదించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ ఘటన గురించి ఎలాంటి సమాచారం లభించినా ఫోను నంబరు 93929 03400కు వివరాలు అందించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:

అశోక్ గజపతిరాజు నగదును తిరస్కరించిన దేవదాయశాఖ

Last Updated :Jan 17, 2021, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.