ETV Bharat / state

పైడితల్లి సిరిమానోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

author img

By

Published : Oct 12, 2019, 8:30 PM IST

Updated : Oct 12, 2019, 9:39 PM IST

paiditalli

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, పూసపాటి వంశీయుల ఆరాధ్యదేవతైన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. సుమారు నెల రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో ప్రధాన ఘట్టాలైన తొలేళ్లు, సిరిమాను ఉత్సవాలు జరగనున్నాయి.

పైడితల్లి సిరిమానోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
విజయనగరంలో కొలువైన ఉన్న శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే పందిరిరాట ఉత్సవంతో అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈనెల 14న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం జరగనుండగా, 15న ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం జరగనుంది.

రాష్ట్ర పండుగగా గుర్తింపు
పూసపాటిరాజుల ఆడపడచు అయిన పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలైన పూసపాటి రాజవంశీయులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ పండుగను రాష్ట్ర పండగగా గుర్తించటంతో ఈ ఏడాది నుంచి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి అధికారులతో సమీక్షించారు. అమ్మవారి పండుగకు సంబంధించిన ఏర్పాట్లన్నీ తుదిదశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు..
అమ్మవారి ప్రధాన పూజారి నివసించే ప్రాంతమైన హుకుంపేటలో సిరిమాను రూపుదిద్దుకుంటుంది. అక్కడనుంచి ఈ సిరిమానును.... సిరిమానోత్సవం నాడు అమ్మవారి చదురుగుడి వద్దకు మేళతాళాలు, సాంస్కృతిక కళారూపాల నడుమ సంప్రదాయబద్దంగా తీసుకువస్తారు. అనంతరం అమ్మవారి రూపంగా ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహిస్తారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్​గడ్ రాష్ట్రాల నుంచీ భక్తులు వస్తారు.

ముమ్మర ఏర్పాట్లు
అమ్మవారి పండుగ దృష్ట్యా.. భక్తుల సౌకర్యార్థం నగరపాలక సంస్థ తరపున కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిరిమాను తిరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా 20 ప్రాంతాల్లో శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అమ్మవారి జాతర ప్రశాంతంగా నిర్వహించటమే లక్ష్యంగా పోలీస్ శాఖ కూడా సమాయత్తమవుతోంది. ఉత్సవాల నిర్వహణకు 2,200 మంది పోలీస్​ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.


చారిత్రక నేపథ్యంతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక సంబంధం కలిగివున్న ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పైడితల్లి మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధమైంది.

Intro:kit 736

ap_vja_40_12_sarpanchulasangam_meeting_avanigadda_avb_ap10044

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రభుత్వ అతిథిగృహంలో కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం మీటింగ్ నిర్వహించారు

నిన్న మచిలీపట్నంలో జరిగిన టి. డి .ఆర్ .సి సమావేశంలో మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి ,కొడాలి నాని, పేర్ని నాని లు గతంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు దొంగలు అని ఉపాధి హామీ పథకం నిధులలో అవినీతి చేసారని 2500 కోట్లు బిల్లులు రూపాయలు తినేశారు అని మాట్లాడిన మాటలు ఖండించిన ఎమ్మెల్సీ వైబి రాజేంద్ర ప్రసాద్ వారికి క్షమాపణ చెప్పాలని డిమెండ్ చేశారు.

సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లో గతంలో చేసిన పనులకు తమకు రావాల్సిన 2500 కోట్లు బిల్లులు కోసం రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి త్వరలో అమరావతికి చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

ఇప్పటివరకు చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం బిల్లులు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవటం చాలా బాధాకరమని ఇప్పటికే చాలామంది వర్క్ చేస్తున్నా సర్పంచులు ఎంపీటీసీలు అప్పుల ఊబిలో కూరుకు పోయారని ప్రభుత్వం వెంటనే వారికి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఇసుక కు తీవ్ర కొరత ఉందని ఇప్పటివరకు ప్రభుత్వం ఇసుక కొరత తీర్చటానికి స్పందించడం లేదని
భవన నిర్మాణ కార్మికులు వేల మంది ఇసుక కొరత వలన పనులు లేక పస్తులు ఉంటున్నారని తెలిపారు.

వాయిస్ బైట్స్

ఎమ్మెల్సీ- యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్


Body:కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రభుత్వ అతిథిగృహంలో కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం మీటింగ్ నిర్వహించారు


Conclusion:కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రభుత్వ అతిథిగృహంలో కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం మీటింగ్ నిర్వహించారు
Last Updated :Oct 12, 2019, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.