ETV Bharat / state

అలా అయితే.. భీమ్లానాయక్ సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా ?: మంత్రి బొత్స

author img

By

Published : Feb 25, 2022, 5:45 PM IST

సినిమా టికెట్‌ ధరలపై ప్రభుత్వం చర్చిస్తోందని, పెంపుపై అంత ఆతృత ఉంటే.. భీమ్లానాయక్ సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వం వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని..నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు.

అలా అయితే భ్లీమా నాయక్ సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా ?
అలా అయితే భ్లీమా నాయక్ సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా ?

అలా అయితే భ్లీమా నాయక్ సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా ?

ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తుందే తప్ప.. వ్యక్తుల కోసం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా టిక్కెట్ల ధరలు, పంపిణీదారులు, థియోటర్ల యజమానుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలపై ఆయన స్పందించారు. సినిమా టికెట్ల విషయంలో కమిటీని వేశామని.. ఆ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. టిక్కెట్ల ధరలు గిట్టుబాటు కాకపోతే.. సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా ? అని ప్రశ్నించారు.

సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం చట్టం ప్రకారం ముందుకెళ్తోందని..,ఈ విషయంపై ఇప్పటికే సినిమా రంగం తరపున నటుడు చిరంజీవి ముఖ్యమంత్రిని కలిశారని గుర్తు చేశారు. విధివిధానాలపై కమిటీని కూడా వేశామని.. ఆ అంశం ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఈ విషయంపై విమర్శలు చేసే వారు.. వ్యక్తుల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించాలని హితవు పలికారు.

అమరావతి ఉద్యమానికి 800 రోజులు పూర్తయిన సందర్భంగా రైతులు చేపట్టిన నిరాహార దీక్షపై మంత్రి బొత్స స్పందించారు. అది రైతు ఉద్యమం కాదని.. రాజకీయ ఉద్యమమని పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా కావాలంటూ తెదేపా కార్యకర్తలు చేస్తున్న ఉద్యమంగా మంత్రి అభివర్ణించారు.

ఇదీ చదవండి

Bheemla Nayak: థియేటర్ల దగ్గర పవన్​ కల్యాణ్​ అభిమానుల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.