ETV Bharat / state

ఒక్క మండలాన్నీ కరవు జాబితాలో చేర్చని వైసీపీ ప్రభుత్వం - సర్కారు తీరుపై మండిపడుతున్న రైతు సంఘాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 8:25 AM IST

Updated : Nov 4, 2023, 1:09 PM IST

Drought_in_Vizianagaram_District
Drought_in_Vizianagaram_District

Drought in Vizianagaram District: పంట పొట్ట దశ నుంచి గింజ దశకు చేరింది. మరో 15 రోజుల్లో చేతికందుతుంది. ఈ సమయంలో వర్షాభావం ప్రభావం పైరుపై పడింది. వరి కంకులతో కళకళలాడాల్సిన చేలు.. కళ్ల ముందే ఎండిపోతున్నాయి. వీటిని చూసిన అన్నదాత గుండె బద్దలవుతోంది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం ఒక్క మండలాన్ని కరవు జాబితాలో చేర్చలేదు. దీనిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

ఒక్క మండలాన్నీ కరవు జాబితాలో చేర్చని వైసీపీ ప్రభుత్వం - సర్కారు తీరుపై మండిపడుతున్న రైతు సంఘాలు

19937825Drought in Vizianagaram District : విజయనగరం జిల్లాలో 2 లక్షల 31 వేల 722 ఎకరాల్లో ఈసారి పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు గంట్యాడ, విజయనగరం, ఆమదాలవలస, సంతకవిటి, వంగర, రామభద్రపురం ఎస్.కోట మండలాలు మినహా ..మిగిలిన మండలాల్లో వర్షాభావంతో దాదాపు 5 వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. ఈ వారంలో వరుణుడు కరుణించకుంటే (No Rains) మరో 25 వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. శృంగవరపుకోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లోనూ చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. వర్షాభావంతో గడిగెడ్డ జలాశయం కింద 2 వేల 900 ఎకరాలు, తోటపల్లి ప్రధాన కుడి కాలవ కింద ఉన్న 26 వేల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందక రైతులు అగచాట్లు పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు ఇంజిన్లతో చెరువుల నుంచి నీటిని తోడుకుంటున్నారు

రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నా మొద్దు నిద్రతో కళ్లు తెరవని వైసీపీ ప్రభుత్వం

Extreme Drought Conditions in Andhra Pradesh : పార్వతీపురం మన్యం జిల్లాలో 91 వేల 882 హెక్టార్ల విస్తీర్ణానికి గాను 74,928 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. ఖరీఫ్‌లో వానలు ఆలస్యం కావడంతో మొక్కజొన్న, చెరకు పంటల సాగు తగ్గింది. ఇప్పుడు తీవ్ర వర్షాభావంతో వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోతోంది. కురుపాం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు నియోజకవర్గంలో వరికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సెప్టెంబర్​లో అంతంత మాత్రంగా వర్షం కురిసినప్పటికీ అక్టోబర్​లో చినుకు జాడ లేదు. దీని వల్ల 90 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. దీనికి తోడు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తిండి గింజలు కూడా చేతికొచ్చే అవకాశం లేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Extreme Drought Conditions in Andhra Pradesh: రాష్ట్రంలో కరవు తాండవిస్తున్నా.. మొద్దునిద్ర వీడని జగన్ సర్కార్

పంటలను కాపాడుకునేందుకు రైతుల భగీరథ ప్రయత్నం : చేతికి వచ్చిన పంట పొలాలు నీళ్లు లేక నెర్రలు బారడం చూసి రైతుల దిగాలు చెందుతున్నాడు. వాటిని కాపాడేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల పెట్టుబడి మరింత పెరిగిందని వాపోతున్నారు.

Rainfall Conditions in Vizianagaram District : తీవ్ర వర్షాభావం వల్ల ఉమ్మడి విజయనగరం జిల్లాలో 60 శాతం పంటలు దక్కని పరిస్థితి నెలకొందని వ్యవసాయ శాఖాధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరవు ప్రాంతంగా గుర్తించక పోవటంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Vizianagaram Farmers Fear Severe Crop Loss: నీరు లేక రైతు కంట కన్నీరు.. ఎండుతున్న పంటలు చూసి బరువెక్కుతున్న గుండెలు

Last Updated :Nov 4, 2023, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.