ETV Bharat / state

APSRTC: తగ్గిన ఆర్టీసీ ఆదాయం.. కారణం అదేనా..!

author img

By

Published : Apr 27, 2023, 5:04 PM IST

APS RTC income Reduced: భానుడి భగభగలతో బయటకు వెళ్లాలంటేనే జనం జడుస్తున్నారు. ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఫలితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పడిపోయింది. ఓఆర్​(ఆక్యుపెన్సీ రేషియో)లో 15.47 శాతం తగ్గుదల... ఆదాయంలో నిత్యం 4 కోట్లకుపైగా వ్యత్యాసం వచ్చిందంటే పరిస్థితికి అద్దం పడుతోంది.

APS RTC income Reduced
APS RTC income Reduced

APS RTC income Reduced: మండుతున్న ఎండలు ప్రయాణాలపై ప్రభావం చూపిస్తోంది. ఎండలకు భయపడి ప్రయాణాలు మానుకుంటున్నారు. దీనిపల్ల ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో.. ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది. లక్ష్యం కంటే ఈ నెలలో 15.47 శాతం ఓఆర్ ​(ఆక్యుపెన్సీ రేషియో) తగ్గుదల కనిపించింది. టిక్కెట్ల రాబడిలో నిత్యం 4 కోట్లకు పైగా వ్యత్యాసం వచ్చింది. దీనికి కారణం పెరుగుతోన్న ఎండలేనని అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ రాకతో పరిస్థితి మారుతుందేమోనని అధికారులు ఆశాభావంతో ఉన్నారు.

భానుడి ప్రతాపంతో ఆర్టీసీ ఆదాయానికి గండి.. ఒక్కో బస్సుపై ఏంత తగ్గిందంటే!

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎండ ధాటికి జనం అల్లాడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయట్లేదు. సొంత వాహనాలు లేదా ఏసీ వాహనాల్లోనే వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ఆలోచిస్తున్నారు. దీంతో టిక్కెట్ల రూపంలో సంస్థకు వచ్చే రాబడిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పరీక్షల సమయం కావడంతో ప్రతిఏటా లక్ష్యం కంటే ఆక్యుపెన్సీ రేషియో.. రాబడి కొంత తగ్గినా.. ఈ సారి ఆ వ్యత్యాసం భారీగా ఉంది.

నిత్యం పదకొండు వేల బస్సులు నడుపుతుండగా.. సగటున ఒక్కో బస్సుకి 16 వేల 416 రూపాయలు వచ్చేది. ప్రస్తుతం 13 వేల 751 మాత్రమే వస్తోంది. అంటే ఒక్కో బస్సుపై రోజూ 2 వేల 665 రాబడి తగ్గింది. ఆర్టీసీ బస్సుల్లో ఓఆర్​ సగటున 60.93 శాతంగా ఉంది. వాస్తవానికి 76.4 శాతం ఉండాలి. కనీసం 70 శాతమైనా వస్తుందనుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. అనుకున్న లక్ష్యం కంటే 15.47 శాతం తగ్గింది. వరుసగా రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉండటం అధికారులను కలవర పెడుతోంది. ఇంత తేడా ఎందుకొచ్చిందని తర్జనభర్జన పడుతున్నారు.

గతేడాది ఆర్టీసీ వరుసగా రెండు సార్లు ఛార్జీలు పెంచడంతో టిక్కెట్ల రూపంలో రాబడి రోజుకు సగటున 18.32 కోట్లకు చేరింది. రోజులను బట్టి కనీసం 17 కోట్లపైనే ఉండేది. కానీ ఈ నెలలో రోజవారీ ఆదాయం సగటున 14.07 కోట్లకు తగ్గిపోయింది. అంటే లక్ష్యం కంటే 4.25 కోట్ల ఆర్టీసీ ఆదాయం పడిపోయింది. సంస్థకు వస్తున్న రాబడిలో 25 శాతం మేర ప్రతినెలా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఆదాయం తగ్గడంతో.. ప్రభుత్వానికి చెల్లించే మొత్తం కూడా తగ్గింది. ఎందుకిలా జరిగిందని ఆర్థికశాఖ కూడా ఆరా తీసినట్లు సమాచారం. పరీక్షల సమయం కావడం, పెళ్లిళ్లు, శుభకార్యాల ముహూర్తాలు లేకపోవడంతో.. రాబడి, ఓఆర్‌ తగ్గిందనేది అధికారుల మాట. ఈ వారం నుంచైనా ప్రయాణికులు పెరిగి ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.