ETV Bharat / state

Book Release: విశాఖలో 'తెలుగు సినిమాల్లో క్రోధ రసం' పుస్తకావిష్కరణ

author img

By

Published : Apr 23, 2023, 8:25 PM IST

Sowjanya Srinivas at VSP: విశాఖలో మీనాక్షి నృత్య రూపకాన్ని ప్రదర్శించేందుకు ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీమతి సౌజన్య త్రివిక్రమ్ శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె "తెలుగు సినిమాల్లో క్రోధ రసం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat

Sowjanya Srinivas at VSP: సృజనాత్మకతమైన రచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మానసిక వికాసానికి నృత్యం ఒక సాధనం అని ప్రముఖ నృత్య కళాకారిణి సౌజన్య త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. దీంతో పాటు ఆమె సంగీత, సాహిత్య నృత్యాలు భావ త్రివేణి సంగమాలు అని వ్యాఖ్యానించారు. విశాఖలో మీనాక్షి నృత్య రూపకాన్ని ప్రదర్శించేందుకు విచ్చేసిన ఆమె.. ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె "తెలుగు సినిమాల్లో క్రోధ రసం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని జర్నలిజం రీసెర్చ్ స్కాలర్ డీ.వీ.ఎస్ శర్మ, ప్రముఖ భాషావేత్త డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ ఇద్దరూ కలిసి రచించారు.

ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన సౌజన్య.. సినిమా భావోద్వేగాల్లో క్రోధ రసం మొదటి నుంచీ ప్రముఖ పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ క్రోధ రసాన్ని విభిన్న సినిమాల్లో ప్రముఖంగా ఆవిష్కరించిన ఘనత మన తెలుగు దర్శకులకు దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రముఖ దర్శక రచయితలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని సౌజన్య తెలిపారు. ఈ విధంగా పుస్తక రచనలను అభినందించిన ఆమె రచయితలను ప్రశంసించారు.

"సృజనాత్మకతమైన రచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మానసిక వికాసానికి నృత్యం ఒక సాధనం. సంగీత, సాహిత్య నృత్యాలు భావ త్రివేణి సంగమాలు. సినిమా భావోద్వేగాల్లో క్రోధ రసం మొదటి నుంచీ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ క్రోధ రసాన్ని విభిన్న సినిమాల్లో ప్రముఖంగా ఆవిష్కరించిన ఘనత మన తెలుగు దర్శకులకు దక్కుతుంది. ప్రముఖ దర్శక రచయితలకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది." - సౌజన్య త్రివిక్రమ్ శ్రీనివాస, ప్రముఖ నృత్య కళాకారిణి

కాగా ఇటీవల విశాఖలో గాంధీయన్ స్టడీస్ సెంటర్​లో సోషల్ మీడియా అడిక్షన్ అనే అంశంపై వర్క్​షాప్​ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో డాక్టర్ గరికిపాటి గురజాడ పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన గిరిజన విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్​తో పాటు సోషల్, ఎమోషనల్ లెర్నింగ్​ను పెంపొందించే లక్ష్యంతో డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ రచించిన "కుక్కురిప విభీషణి సింహ్" అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అంతరించిపోతోన్న గదబా, ఇంగ్లీష్​ భాషల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గురజాడ.. ఆధ్యాత్మికత విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే హోలిస్టిక్ డిజిటల్ డిటాక్స్​ను అందిస్తుందని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.