ETV Bharat / state

ప్రియుడితో కలిసి విశాఖ చేరుకున్న సాయిప్రియ

author img

By

Published : Jul 30, 2022, 3:56 AM IST

విశాఖ బీచ్‌లో కనిపించకుండా పోయి బెంగళూరులో ప్రత్యక్షమైన సాయిప్రియను పోలీసులు విశాఖకు తీసుకొచ్చారు. ఆమెతో పాటు ప్రియుడు రవిని కూడా తీసుకువచ్చిన పోలీసులు ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరిని విచారించారు. పెళ్లి రోజు సందర్భంగా విశాఖ బీచ్‌కు భర్త శ్రీనివాస్‌తో కలిసి వచ్చిన సాయిప్రియ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రియుడు రవితో బెంగళూరుకు వెళ్లి అక్కడ అతనిని పెళ్లి చేసుకుంది. సాయిప్రియపై విశాఖలో మిస్సింగ్‌ కేసు నమోదవడంతో ఇద్దరినీ నగరానికి తీసుకొచ్చారు.

ప్రియుడితో కలిసి విశాఖ చేరుకున్న సాయిప్రియ
ప్రియుడితో కలిసి విశాఖ చేరుకున్న సాయిప్రియ

విశాఖ బీచ్‌లో కనిపించకుండా పోయి బెంగళూరులో ప్రత్యక్షమైన సాయిప్రియను పోలీసులు విశాఖకు తీసుకొచ్చారు. ఆమెతో పాటు ప్రియుడు రవిని కూడా తీసుకువచ్చిన పోలీసులు ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరిని విచారించారు. సాయిప్రియపై విశాఖలో మిస్సింగ్‌ కేసు నమోదవడంతో ఇద్దరినీ నగరానికి తీసుకొచ్చారు.

ఏం జరిగిందంటే..: విశాఖకు చెందిన సాయిప్రియకు, శ్రీనివాసరావుతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనివాసరావు.. రెండో పెళ్లి రోజు జరుపుకునేందుకు పుట్టింట్లో ఉన్న సాయిప్రియ వద్దకు వచ్చాడు. సోమవారం సాయంత్రం (ఈనెల 25న) భార్యాభర్తలు సరదాగా ఆర్కే బీచ్​లో గడిపారు. ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో సముద్రంలో కాళ్లు కడుక్కుని వస్తానని చెప్పిన సాయిప్రియ మళ్లీ భర్తకు కానరాలేదు. ఆమె సముద్రంలో గల్లంతై ఉంటుందని భావించిన శ్రీనివాసరావు అత్తమామలకు సమాచారమిచ్చాడు.

విశాఖ డిప్యూటీ మేయర్ జియ్యాన శ్రీధర్ వార్డులోనే సాయిప్రియ తల్లిదండ్రులు ఉండడం వల్ల ఆయన ద్వారా పోలీసులకు తెలియజేశారు. కోస్ట్ గార్డు సహాయంతో గాలింపు చర్యలు కొనసాగించారు. ఒక హెలికాప్టర్, రెండు భారీ టగ్‌ల సహాయంతో తీరం వెంట.. సముద్ర జలాల్లోనూ గాలింపు చేపట్టారు. మూడో పట్టణ పోలీసులు సాగర తీరం వెంబడి ఉన్న నిఘా కెమెరాల రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఎక్కడా మహిళ మునిగిపోతున్న దృశ్యాలు నమోదు కాలేదు. చివరకు సాయిప్రియ కాల్‌ డేటా ఆధారంగా విచారణ సాగించడంతో.. ఆమె నెల్లూరులో బంధువులింట ఉందని తెలిసింది.

ఆ తర్వాత ఆమె బెంగళూరు నుంచి తల్లిదండ్రులకు వాట్సప్​ మెసెజ్​ చేసింది. తాను క్షేమంగా ఉన్నానని.. రవితో ఇష్టపూర్వకంగా వెళ్లినట్లు తెలిపింది. తన ఫొటోను పంపిన ఆమె.. తాళిబొట్టుతో కనిపించింది.సాయిప్రియను వెదికేందుకు పోలీసులు, గజ ఈతగాళ్లు, కోస్ట్ గార్డు బోట్లు, హెలికాప్టర్లతో ఎంతో శ్రమించారు. ఒక టగ్ ఒక గంట సేపు గాలించాలంటే వందల లీటర్ల డీజిల్ వాడాలి. హెలికాప్టర్ గాలిలో గంట సేపు సముద్ర తీరం వెంబడి గాలించాలంటే భారీగానే ఖర్చు పెట్టాలి. సాయిప్రియ కోసం దాదాపు 10 గంటల పాటు రెండు టగ్ బోట్లు, ఒక హెలికాప్టర్ గాలింపులో పాల్గొన్నాయి.

ఇవీ చూడండి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.