ETV Bharat / state

మావోయిస్టుల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు

author img

By

Published : Feb 6, 2021, 11:32 AM IST

విశాఖ ఏజెన్సీలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రజలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. భద్రతాబలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో ఎస్​ఈబీ అదనపు ఎస్పీ చెక్​పోస్టుల వద్ద సోదాలు చేశారు.
Police   alert at visakha agency
మావోయిస్టుల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు

విశాఖ ఏజెన్సీలో చట్ట వ్యతిరేక శక్తులకు లొంగకుండా ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ కోరారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ప్రజలు బహిష్కరించాలి అంటూ మావోయిస్టులు పిలుపునివ్వడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ఎన్నికల ఆటంకం కలిగించకుండా విస్తృతంగా కూంబింగ్ చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. 1400 మంది సాయుధ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని.. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టమన్నారు. మండల కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక మొబైల్ టీం ఉంటుందని అన్నారు. ప్రజలు భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలోని ఎన్నికల నేపథ్యంలో చెక్​పోస్ట్​ల వద్ద ఎస్​ఈబీ అదనపు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తనిఖీలు చేశారు. అక్రమంగా మద్యం రవాణాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నగదను తరిలిస్తే వాటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన సిబ్బందికి సూచించారు.

ఇదీ చూడండి. ఆ గ్రామాల్లో భేషుగ్గా సమాచార స్రవంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.