ETV Bharat / state

పురిటి నొప్పుల భారం.. రైల్లోనే ప్రసవం

author img

By

Published : Jun 7, 2020, 10:30 PM IST

Migrant Woman birth Baby in Konark Express train in anakapalli vishakapatnam district
పురిటి నొప్పులు భరిస్తూ.. ఆడబిడ్డకు జననం

ఆమె నిండు గర్భిణీ.. పైగా వలస కూలీ... ఊరు కాని ఊరిలో లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయింది. జీవనాధారం లేక స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. దాదాపు రెండు వేల కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమైంది. కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలో రైలెక్కింది. మార్గమధ్యంలో ఆమెకు పురిటి నొప్పులు అధికమయ్యాయి. ఎముకలు విరిచేస్తోన్న బాధను పంటి బిగువున భరిస్తూ.. నడుస్తున్న రైల్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఓ నిండు గర్భిణీ రైలులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని భువనేశ్వర్​కు చెందిన లెంక సరిత ముంబయిలో ఉపాధి పొందుతూ జీవిస్తోంది. లాక్​డౌన్, కరోనా వైరస్ వ్యాప్తితో ఉపాధి కోల్పోయిన ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది. సరిత నిండు గర్భిణీ కావడం వల్ల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. చేసేదేమీ లేక సరిత కుటుంబ సభ్యులు సొంతూరుకు కోణార్క్​ ఎక్స్​ప్రెస్​లో బయలుదేరారు.

ఈ క్రమంలోనే సరితకు పురిటినొప్పులు మొదలయ్యాయి. రైలు అనకాపల్లికి చేరేసరికి ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం తెలుసుకున్న అనకాపల్లి స్టేషన్​ సిబ్బంది సరితను 108లో స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని... రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి..

10 ఏళ్ల నుంచి మానవసేవలో.. ఆదర్శ దంపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.