ETV Bharat / state

'జీ-20 సదస్సు' పనుల్లో 100 కోట్ల అవినీతి.. విచారణ జరిపించాలి : జనసేన నేత మూర్తి యాదవ్

author img

By

Published : Apr 8, 2023, 6:09 PM IST

Jana Sena corporator: విశాఖలో జీ-20 పనుల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. అవినీతికి పాల్పడిన కమిషనర్ బదిలీ పై వెళ్లిపోవడంతో విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. జీ-20 పనుల పేరిట ప్రారంభించినవన్నీ అయిపోయాయని చెబుతున్నారని.. ఒక రోడ్డు తప్ప.. మిగిలినవన్నీ అలానే ఉన్నాయంటూ మండిపడ్డారు.

Jana Sena corporator
పీతల మూర్తి యాదవ్

Jana Sena corporator on G-20: విశాఖ నగరంలో జీ-20 పనుల పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జనసేన ఆరోపించింది. ఎటువంటి టెండర్లు లేకుండా జీవీఎంసీ కమిషనర్ పనులను కట్టబెట్టిన తీరు అధికార యంత్రాంగాన్ని విస్మయ పరుస్తోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా, భారీగా అతినీతికి కూడా పాల్పడ్డారన్న విమర్శలు కమిషనర్ రాజాబాబుపై ఉన్నాయని, అటువంటి వ్యక్తి బదిలీపై వెళ్లిపోవడం విశాఖ వాసుల అదృష్టం అని పేర్కొన్నారు. జీ-20 పనుల పేరిట ప్రారంభించినవన్నీ అయిపోయాయని చెబుతున్నారని ఒక రోడ్డు మినహా మిగిలినవన్నీ అలానే ఉన్నాయని విమర్శించారు. వీటిపై దర్యాప్తు సంస్ధతో విచారణ చేయించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.

ఒక అవినీతి అధికారిని సాగనంపడంపై విశాఖ ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోందని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. జీ-20 సదస్సు పేరుతో రూ.157 కోట్లతో అవినీతి జరిగినట్లు ఆరోపించారు. టెండర్లు పిలవకుండానే కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారని తెలిపారు. విశాఖ నగర సుందరీకరణ పేరుతో ప్రజలను దోచుకున్నారని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. అధికారులు, వైసీపీ నేతలు చేసిన అవినీతి భాగోతాన్ని జనసేన పార్టీ గత నెల రోజులుగా ప్రజలకు తెలియజేస్తుందని మూర్తి తెలిపారు. విశాఖ ప్రజలు పన్నులు కడితే .. ప్రజా ధనాన్ని కమిషనర్ వృథా చేశారని మండిపడ్డారు. కేవలం విమానాశ్రయం నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, రెండు హోటల్స్ వరకు మాత్రమే కొన్ని పనులు చేశారని మూర్తి యాదవ్ వెల్లడించారు. సీత కొండ దగ్గర సుందరీకరణ పనుల పేరుతో రూ. 3.2 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రాక్ పెయింటింగ్ పేరుతో కొండలపై లక్షల రూపాయలు దొచుకున్నారంటూ పేర్కొన్నారు.

జీ-20 ముసుగులో దొపిడిపై విచారణ చేయాలని జనసేన డిమాండ్ చేస్తోందని మూర్తి యూదవ్ వెల్లడించారు. పనులు కేటాయించే విషయంలో అధికారులు, వైసీపీ నేతలు ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. జీ-20 పనుల కోసం కమిషనర్ కాంట్రాక్టర్స్​తో కుమ్మకై వారి నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. జీ-20 పనులకు సంబంధించి కమిషనర్ 5 శాతం ముడుపులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని మూర్తి యాదవ్ వెల్లడించారు. జీ-20 సుందరీకరణ కోసం జరిగిన పనుల్లో అక్రమాలపై ఏసీబీతో విచారణ జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. పనులు పూర్తి కాకుండానే.. అయినట్లు తెలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీ-20 సదస్సు కోసం విశాఖ నగర సుందరికరణ పేరుతో రూ. 157 కోట్లతో పనులు చేపట్టారు. అందులో సుమారు రూ. 100 కోట్ల వరకు అవినీతి జరిగింది. ఈ అవినీతి భాగోతాన్ని జనసేన పార్టీ గత నెలరోజులుగా ప్రజలకు తెలియజేస్తుంది. విశాఖ ప్రజలు పన్నులు కడితే ఈ కమిషనర్‌ డబ్బులను వృథా చేశారు. కేవలం విమానాశ్రయం నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు మాత్రమే కొన్ని పనులు చేశారు. సీత కొండ దగ్గర సుందరీకరణ పనుల పేరుతో రూ. 3.20 కోట్లు దోచుకున్నారు. రాక్ పెయింటింగ్ పేరుతో కొండలపై మామూలు రంగులు వేసి లక్షల రూపాయలు దోచుకున్నారు. ఈ అంశంపై జనసేన పూర్తిగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తోంది. నగర కమిషనర్ జీ-20 పనుల కోసం కాంట్రాక్టర్స్ తో కుమ్మకై వారి నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. - పీతల మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.