ETV Bharat / state

ఆడుకుంటూ గాయపడిందనుకున్నారు.. కానీ, మూడేళ్లకే నిండిన నూరేళ్లు..!

author img

By

Published : Apr 8, 2023, 3:58 PM IST

Etv Bharat
Etv Bharat

Three Years Child Death : అనంతపురం జిల్లాలో అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి ఒంటిపై గాయాలను చూసిన తల్లిదండ్రులు.. ఆడుకుంటూ గాయపడిందేమో అనే అనుమానంతో ప్రాథమిక చికిత్స చేయించారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత చిన్నారి వింతగా ప్రవర్తించటంతో మెరుగైన చికిత్స అందించినా ఫలితం దక్కలేదు.

Child Dies Due to Dog Bite : తెలియని పసితనమే ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. ముద్దు ముద్దు పలుకులు పలికే ఆ చిన్నారి తనను కుక్క కరిచిందనే విషయం తల్లిదండ్రులకు చెప్పలేక పోయింది. తల్లిదండ్రులు తెలుసుకునే సరికి చిన్నారి ఆరోగ్య పరిస్థితి చేయిదాటిపోయింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం ముప్పులకుంట గ్రామంలో జహ్నవి అనే మూడు సంవత్సరాల చిన్నారి కుక్క కాటుకు బలైంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపాల్​కు ప్రమీలతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు మొదటి సంతానం కాగా, కుమార్తె జహ్నవి రెండో సంతానం. మూడు నెలల క్రితం చిన్నారికి శరీరంపై స్వల్పంగా గాయలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు ఆడుకుంటూ గాయపడి ఉంటుందని భావించి.. చికిత్స అందించారు. ఆ సమయంలో చిన్నారి ఆరోగ్యం కుదురుగానే ఉన్నా.. ఇటీవల చిన్నారి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. చిన్నారి వింతగా ప్రవరిస్తుండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు.

పరిస్థితి విషమంగా మారటంతో బెంగళూరులోని మానసిక వైద్యశాలకు తరలించారు. అక్కడికి తరలించి చికిత్స అదించినా ఫలితం దక్కలేదు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. తమ కళ్ల ముందే అడుతూ తిరిగిన చిన్నారి.. కానరాని లోకాలకు వెళ్లటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చిన్నారి మృత్యువుతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మే 31 వ తేదీనే చిన్నారి పుట్టిన రోజు అంటూ తల్లిదండ్రులు దుఃఖించినా తీరు స్థానికుల చేత కంటతడి పెట్టించింది.

ఆలస్యంగా కుక్క కాటు వెలుగులోకి : చిన్నారికి ఒంటిపై గాయాలు చూసిన తల్లిదండ్రులు.. వారి ఇంటి దగ్గర ఉన్న ఆలయంలో ఆడుకుంటూ గాయపడిందని భావించారు. ఆ మేరకు చిన్నారికి చికిత్స అందించారు. కొన్ని రోజులు గడిచినా తర్వాత వారికి చిన్నారిని కుక్క కరిచిందనే విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అప్పటికే ఘటన జరిగి కొన్ని రోజులు కావటంతో చికిత్స అందించిన చిన్నారికి నయం కాలేదు. వారం క్రితం చిన్నారి వింతగా ప్రవర్తించటం ప్రారంభించింది.

కుక్కుల భారీ నుంచి కాపాడాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చిన్నారిపై దాడి చేసిన రోజుల్లో పిచ్చి కుక్క ఒకటి గ్రామంలో స్వైర విహారం చేసిందని గ్రామస్థులు తెలిపారు. అదే సమయంలో చిన్నారిని కరిచి ఉంటుందని భావిస్తున్నారు. ఆ సమయంలో అది ప్రజలపై దాడి చేసిందని.. అంతేకాకుండా ఆవులు, పశువులపై దాడి చేసి కరిచిందని గ్రామస్తులు వాపోయారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.