ETV Bharat / state

మోదీ విశాఖ పర్యటన.. మారుతి కూడలిలో రోడ్​షో

author img

By

Published : Nov 11, 2022, 5:27 PM IST

Updated : Nov 11, 2022, 9:36 PM IST

SECURITY AT VISAKHA AIRPORT : ప్రధాని మోదీ విశాఖకు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​, సీఎం జగన్​ స్వాగతం పలికారు. మధురైలో వర్షం కారణంగా విశాఖకు ఆరగంట ఆలస్యంగా చేరుకున్నారు. భాజపా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రోడ్​షోలో మోదీ పాల్గొన్నారు. ఈ రాత్రికి తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని 'చోళ సూట్‌'లో అతిథిగృహంలో బస చేస్తారు

welcome to modi
ప్రధాని మోదీకి గవర్నర్​, సీఎం స్వాగతం

మోదీ విశాఖ పర్యటన.. మారుతి కూడలిలో రోడ్​షో

PM MODI ROAD SHOW AT MARUTHI JUNCTION : రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖకు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్, సీఎం జగన్​ స్వాగతం పలికారు. మధురైలో వర్షం కారణంగా విశాఖకు ఆరగంట ఆలస్యంగా చేరుకున్నారు. భాజపా పార్టీ ఏర్పాటు చేసిన రోడ్​షోలో మోదీ పాల్గొన్నారు. మారుతి కూడలి నుంచి 1.5 కిలోమీటర్ల మేర రోడ్​షో కొనసాగింది. రోడ్​షోలో భారీ ఎత్తున భాజపా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మోదీ ప్రజలకు అభివాదం చేశారు. ప్రధాని రోడ్ షో మార్గంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీకి గవర్నర్​, సీఎం స్వాగతం
ప్రధాని మోదీకి గవర్నర్​, సీఎం స్వాగతం

పోలీసుల దిగ్బంధంలో విశాఖ: ప్రధాని నరేంద్ర మోదీ రాక దృష్ట్యా విశాఖ నగరాన్ని పోలీసు దిగ్బంధం చేశారు. ప్రధాని, గవర్నర్, సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన గత పరిణామాల దృష్ట్యా విమానాశ్రయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. మీడియాకు సైతం విమానాశ్రయ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరించారు. అయితే భద్రత దృష్ట్యా పోలీసుల తనిఖీలతో విమాన ప్రయాణికులకు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఏయూ వద్ద హెలీప్యాడ్ల ట్రైల్స్​: విశాఖలో ప్రధాని రాక సందర్భంగా ఏయూ ప్రాంగణంలో నౌకాదళ అధికారులు, సిబ్బంది 3 హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. రేపు ప్రధాని ప్రసంగించనున్న బహిరంగ సభకు చేరువలో హెలీప్యాడ్లు ఏర్పాటు చేసిన సిబ్బంది.. అందుకు సంబంధించిన ట్రైల్స్ జరిపారు. ప్రధాని సభ వద్ద భద్రతా ఏర్పాట్లను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు.

విశాఖకు ప్రధాని: రాత్రి 7.25 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ విశాఖకు చేరుకున్నారు. ఈ రాత్రికి తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని 'చోళ సూట్‌'లో అతిథిగృహంలో బస చేస్తారు. రేపు ఉదయం 10.10కి బహిరంగ సభ ప్రాంగణానికి ప్రధాని చేరుకోనున్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం.. రేపు మధ్యాహ్నం ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి హైదరాబాద్‌ వెళ్లనున్నారు.

సభలో సుమారు 40నిమిషాల పాటు మోదీ ప్రసంగం: రేపు ప్రధాని పాల్గొనే బహిరంగ సభ వేదికపైకి ప్రధానితో పాటు ముగ్గురుకే అనుమతి లభించింది. ప్రధానితో పాటు వేదికపైన గవర్నర్, సీఎం జగన్​, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​లు మాత్రమే ఉంటారు. మరో వేదికపై 100 మందికి పైగా మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆసీనులు కానున్నారు. ఇంకో వేదికపై.. 60 మందికి పైగా కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు ఉండనున్నారు. ప్రధాని వేదికలో మాట్లాడేందుకు సీఎం జగన్‌కు 7 నిమిషాల సమయం కేటాయించగా.. ప్రధాని మోదీ సుమారు 40 నిమిషాలు మాట్లాడనున్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించనున్నారు.

విశాఖకు చేరుకున్న పవన్​: జనసేన అధినేత పవన్​కల్యాణ్​.. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్న నేపథ్యంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. మారుతీ కూడలిలో మోదీ రోడ్​ షో అనంతరం.. చోళ సూట్‌లో ప్రధానితో భేటీ కానున్నారు. అయితే పవన్‌ కంటే ముందు ప్రధానితో రాష్ట్ర భాజపా నేతలు భేటీ కానున్నారు.

Visakha Steel Plant Workers Protest : దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో.. స్టీల్​ ప్లాంట్​ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన నిరసనలు, దీక్షలను ఉద్ధృతం చేశారు. స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన దీక్షలు 638 రోజూ కొనసాగుతున్నాయి.

కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉక్కు కార్మికులు నిరసన తెలుపుతున్నారు. సేవ్‌ వైజాగ్‌ స్టీల్‌, విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు . ఈ నిరసనలో ఉద్యోగులతో పాటు కుటుంబసభ్యులు సైతం పాల్గొన్నారు. పోరాటాలతో సాధించుకున్న ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతున్నారు. ప్రధాని మోదీ నగరానికి వస్తున్న సందర్భంగా ప్లాంట్‌ను.. ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ నేతలు అరెస్ట్​: స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు.. స్టేషన్​కు తరలించారు. నిర్బంధాలు, అణిచివేతలతో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఆపలేరని కార్మికులు తేల్చిచెప్పారు.

నిరాహార దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరహార దీక్షలకు మద్దతు తెలపడానికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. ఈ నేపథ్యంలో దీక్ష శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక పడి లేచిన కెరటం లాగా ముందుకెళ్తుంది తప్ప.. ఆగదని నినాదాలు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 11, 2022, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.