ETV Bharat / state

BJP Leaders Comments: 'బటన్ నొక్కుడు కార్యక్రమాలు అందుకోసమే'

author img

By

Published : Jun 13, 2023, 7:56 PM IST

BJP Leaders Comments on Jagan: నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రశ్నించే వారిని వేధించడం తప్ప వైసీపీ ప్రభుత్వం మరేమీ చేయడం లేదని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసేందుకే బటన్లు నొక్కుతున్నానని ముఖ్యమంత్రి చెబుతున్నా.. అసలు లక్ష్యం మాత్రం సాక్షి పత్రిక ప్రకటనల కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP Leaders Comments
బీజేపీ నేతలు

BJP Leaders Comments on Jagan: కేంద్రంలో బీజేపీ ఎప్పుడూ వైసీపీతో లేదని, ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఇప్పటివరకు తమతో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారని.. ఇదెంతమాత్రం నిజం కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి నేరుగా స్పందించకుండా.. తన మంత్రులు, చోటా నేతలతో మాట్లాడించారని అన్నారు.

విశాఖను భూ కుంభకోణాలకు నిలయంగా మార్చారని, తాము వేసిన సిట్ నివేదికను బయటపెట్టగలిగే పరిస్ధితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని.. భూకబ్జాదారులను ఈ ప్రభుత్వం కాపాడుతోందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి నిజంగా అరాచకాలను అరికట్టే దమ్ముంటే నేరుగా సీబీఐ విచారణను అహ్వానించగలరా అని సవాలు విసిరారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు.

Atchannaidu Comments on YSRCP: వైసీపీ పాలనలో దళితులపై అనేక దాడులు: అచ్చెన్నాయుడు

బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీల దెబ్బకు నేరుగా ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్దితి తలెత్తిందని.. దీని గురించి ముఖ్యమంత్రికి నేరుగా విన్నవించుకునేందుకు మంత్రులకు కూడా అవకాశం లేకపోవడం దారుణమన్నారు. మాట్లాడితే సింహం సింగిల్​గా వస్తుందని ఆ పార్టీ నేతలు జగన్​ని ఉద్దేశించి అంటున్నారని.. అదే సింహం ఒంటరిగా పోతుందన్నది కూడా రుజువవుతుందని ఎద్దేవా చేశారు.

బటన్ నొక్కుడు కార్యక్రమాలు సాక్షి పత్రిక ప్రకటనల కోసమే - విష్ణుకుమార్ రాజు

మార్గదర్శిపై కక్ష సాధింపు: ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించడం తప్ప వైసీపీ ప్రభుత్వం మరేమీ చేయడం లేదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శి సంస్ధపై.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విచారణ పేరుతో వేధిస్తున్నారని.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే బటన్లు నొక్కుతున్నానని ముఖ్యమంత్రి చెబుతున్నా.. అసలు విషయం మాత్రం సాక్షి పత్రిక ప్రకటనల కోసమేనని ఆరోపించారు.

Nakka Anandbabu comments: విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించింది జగన్ కాదా..? : టీడీపీ నేత నక్కా ఆనంద్​బాబు

"కొంతమంది వైసీపీ నాయకులు, మంత్రులు మాట్లాడుతూ.. కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని అన్నారు. హామీల అమలు గురించి ఏమీ చెప్పలేదు అన్నారు. దీని గురించి చర్చకు రండి. బీజేపీ అండగా ఉండకపోవచ్చని సీఎం జగన్ అన్నారు.. మీకు ఎప్పుడూ బీజేపీ అండగా లేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని మేము ప్రయత్నిస్తున్నాం. అమిత్​షా వచ్చి క్లియర్​గా చెప్పారు. మళ్లీ ఈ డ్రామా రాజకీయాలు ఇప్పుడు మొదలుపెడుతున్నారు". -జీవీఎల్ నరసింహరావు, ఎంపీ

"ఈ రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించండి సీఎం జగన్​. పరిశ్రమలు అన్నీ సర్వనాశనం అయ్యాయి. వైసీపీ నాయకులు, మంత్రులు.. సింహం సింగిల్​గా వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు సింగిల్​ గానే వస్తారు.. సింగల్​గానే పోతారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అస్సలు మీకు ఏం చేసింది. ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా ఉన్న సంస్థని.. మీ కక్ష సాధింపు చర్యలతో ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. ఈ బటన్లు నొక్కుడు కార్యక్రమం ఎందుకంటే.. మీ పత్రికకు ప్రకటనలు ఇవ్వడానికే మాత్రమే". -విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్యే

Amit Shah Speech: రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో రాష్ట్రం.. జగన్​ సిగ్గుపడాలి.. : అమిత్​ షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.