ETV Bharat / state

CM Jagan Inaugurated the Infosys Center in Visakha ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ప్రారంభించిన సీఎం జగన్.. త్వరలో విశాఖకు వచ్చేస్తున్నానని ప్రకటన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 6:15 PM IST

CM Jagan Inaugurated the Infosys Center in Visakha: విశాఖలో సీఎం జగన్ ఇన్ఫోసిస్ డేటా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగానే పాలన సాగించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని సీఎం వెల్లడించారు.

CM_Jagan_Inaugurated_Infosys_Center
CM_Jagan_Inaugurated_Infosys_Center

CM Jagan Inaugurated the Infosys Center in Visakha: విశాఖపట్నం జిల్లా మధురవాడ ఐటీ హిల్స్ 2లో నిర్మించిన ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ డేటా కేంద్రం ద్వారా క్లౌడ్, A.I, డిజిటల్ టెక్నాలజీ సేవలను అందించనున్నారు. ఈ కేంద్రంలో మొదటి దశలో 500 మందికి అవకాశం కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ యాజమాన్యం వెల్లడించింది.

CM Jagan Comments: ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..''ఇన్ఫోసిస్‌ లాంటి పెద్ద సంస్థ విశాఖకు రావడంతో స్థానిక యువతకు ఉపాధి లభించడమే గాక.. ఇంకా పేరున్న ఐటీ సంస్థలు తరలివచ్చే అవకాశం ఉంది. విశాఖలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యా కేంద్రాల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో యువత చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వారందరికీ ఇలాంటి సంస్థలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.'' అని అన్నారు.

CM Jagan Comments on Governance from Vizag: డిసెంబర్‌ నాటికి విశాఖకు రాబోతున్నా.. ఇక్కడే ఉంటా: సీఎం జగన్​

CM Jagan on Visakha Administration: త్వరలోనే తాను కూడా విశాఖ రాబోతున్నానని.. డిసెంబర్ నుంచి కార్యకలాపాలు సాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాష్ట్రంలోనే విశాఖ అతి పెద్ద నగరమన్న జగన్.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై స్థాయికి అభివృద్ధి చెందే సామర్థ్యం విశాఖ నగరానికి ఉందన్నారు. అనంతరం విశాఖలో మంచి కార్యాలయాన్ని చూడాలని తన అధికారులను ఇదివరకే కోరినట్లు జగన్ పేర్కొన్నారు. తాను కూడా ఇక్కడకు త్వరలోనే వస్తున్నానన్న సీఎం.. ఇక్కడకు సీఎం రావాలంటే.. సిబ్బంది, భద్రతా సిబ్బంది అంతా రావాల్సి వస్తుందన్నారు. వచ్చే డిసెంబర్‌ నాటికి విశాఖకు వచ్చేస్తానని, ఆ తర్వాత విశాఖలోనే ఉంటానని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.

Infosys Development Center Details: ఇక, ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ విషయానికొస్తే.. సుమారు 1,000 మంది ఉద్యోగులకు తగిన సదుపాయాలు కల్పించేలా.. డెవలప్‌మెంట్ సెంటర్, ఇన్ఫోసిస్ భవిష్యత్తు, హైబ్రిడ్ వర్క్స్ వంటివి రూపొందించినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీంతోపాటు ఇన్ఫోసిస్ కమిట్మెంట్లు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా కార్యాలయం విద్యుత్, నీటి వినియోగం, వ్యర్థాల నిర్వహణ వంటి సదుపాయాలతో కేంద్రాన్ని నిర్మించినట్లు పేర్కొంది.

Police Restrictions to Public Due to CM Jagan Tour: సీఎం జగన్ పర్యటిస్తే చెట్లే కాదు.. దేవుడైనా పక్కకు జరగాల్సిందే..!

IT Employees in Trouble with CM Visit: మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సీఎం జగన్ విశాఖ విమానాశ్రయంలో దిగి నేరుగా ఐటీ హిల్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ దిగి.. పక్కనే ఉన్న ఇన్ఫోసిస్‌ కేంద్ర ప్రారంభానికి వెళ్లాల్సి ఉండడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఉదయం విధులకు హాజరుకావాల్సిన ఐటీ హిల్ నెంబర్ వన్, టూ, త్రీ ఉద్యోగులు.. వారి కార్యాలయాలకు దూరంగా వాహనాలను నిలిపేసి నడుచుకుంటూ విధులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడుతూనే విధులకు హాజరయ్యారు. విశాఖలో సీఎం పర్యటన సందర్భంగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ను పోలీసులు గృహ నిర్బంధంచారు.

Janasena Nadendla Manohar on CM Jagan పోలీసులు లేకుండా ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలి: నాదెండ్ల మనోహర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.