ETV Bharat / state

అత్యాచారానికి యత్నించిన యువకుడిని, తీవ్రంగా ప్రతిఘటించిన బాలిక

author img

By

Published : Oct 30, 2022, 8:06 AM IST

Updated : Oct 30, 2022, 1:01 PM IST

Visakhapatnam: చిరునామా చెప్పాలని అడిగిన యువకుడిని గుడ్డిగా నమ్మి.. ఆ ప్రాంతం ఎక్కడుందో చూపేందుకు వెళ్లి ఆపదలో చిక్కుకుంది ఓ బాలిక. చిరునామా వెనుక దురుద్దేశ్యాన్ని గుర్తించిన ఆ బాలిక, వెంటనే తేరుకుని నిందితుడి చెర నుంచి ధైర్యంగా బయటపడింది. ఈ ఘటన విశాఖపట్టణంలో వెలుగు చూసింది.

విశాఖపట్టణం
Visakhapatnam

Visakhapatnam: చిరునామా చెప్పాలని అడిగిన యువకుడిని ఓ బాలిక గుడ్డిగా నమ్మి.. ఆ ప్రాంతం ఎక్కడుందో చూపేందుకు వెళ్లి ఆపదలో చిక్కుకున్న ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. ఆదర్శనగర్‌కు చెందిన బాలిక(11)ను శనివారం మధ్యాహ్నం బీఎన్‌ఆర్‌ నగర్‌కు చెందిన సాయికుమార్‌ (22) తహసీల్దార్‌ కార్యాలయం చిరునామా అడిగాడు. అదెక్కడుందో తనతో వచ్చి చూపాలని కోరగా ఆ బాలిక గుడ్డిగా అతడిని నమ్మి ద్విచక్ర వాహనంపై వెళ్లింది.

ఈ క్రమంలో సాయికుమార్‌ ఓ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. వెనువెంటనే ఆ బాలిక తేరుకుని, తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ సమయంలో యుకుడు.. బాలికను తీవ్రంగా గాయపర్చాడు. అయినా, శక్తిని కూడగట్టుకుని.. నిందితుడి చెర నుంచి ధైర్యంగా బయటపడింది ఆ బాలిక. విశాఖ వ్యాలీ స్కూల్‌ పక్కన ఉన్న రోడ్డుపైకి గాయాలతో వచ్చిన బాలిక పరిస్థితిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. నిందితుడు సాయికుమార్‌గా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారించగా., నిందితుడు ఓ స్టోర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. బాలికపై అత్యాచారం జరగలేదని.. లైంగిక దాడికి నిందితుడు యత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణను దిశ పోలీసు స్టేషన్ కి అప్పగించినట్టు నగర పోలీసు కమిషనర్ వెల్లడించారు.

బాలిక తల్లితండ్రులను కలిసేందుకు వీల్లేదన్న ఏసీపీ హర్షిత చంద్ర: జరిగిన ఘటనను బాలిక తల్లిదండ్రులు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు వివరించారు. దీంతో ఆయన హుటాహుటిన బాలికను పరామర్శించేందుకు వెళుతుండగా.. విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసలైన వారితో విశాఖ నగరంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయని, పోలీసులు వారిని అడ్డుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే వెలగపూడి ఆరోపించారు. మనోధైర్యం నింపడానికి శాసనసభ్యుడిగా తాను వెళ్తుంటే, పోలీసులు అడ్డుకోవడం ఏంటని.. ఆయన మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 30, 2022, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.