తిరుమలలో మరో అన్నప్రసాద వితరణ కేంద్రం.. త్వరలో అందుబాటులోకి మరో రెండు కేంద్రాలు

author img

By

Published : Jan 2, 2023, 10:22 AM IST

TTD Chairman Subba Reddy
తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ()

Annaprasada Distribution Center in Tirumala: తిరుమలలో మరో అన్నప్రసాద వితరణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీనిని తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. భక్తులు రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరిన్ని భవనాలను భక్తుల సౌకర్యార్ధం తీసుకొస్తామని తెలిపారు.

Annaprasada Distribution Center in Tirumala: తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం పెరుగుతున్న భక్తుల రద్దీతో పలు ప్రాంతాల్లో అన్నదాన భవనాలు పునః ప్రారంభించాలని పాలక మండలి నిర్ణయించింది. ఈ మేరకు పీఏసీ-4గా ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్​లో మళ్లీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం మొదలుపెట్టింది.

"గత మూడు నెలల నాడే ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంగమాంబ అన్నప్రసాద హాలులో ఏ విధంగా ప్రసాదం అందిస్తున్నామో.. అదే విధంగా ప్రస్తుతం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ కారణంగా వివిధ ప్రాంతాలలో అన్న ప్రసాదం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో మొదటిది పీఏసీ - 4లో ప్రారంభించడం జరిగింది. ఇది కాలినడకన వచ్చే భక్తులకు చాలా దగ్గరగా ఉంటుంది. అదే విధంగా రాబోయే రెండు..మూడు నెలల్లో మరో రెండు చోట్లు అందుబాటులోకి తీసుకువస్తాం". - వై.వి.సుబ్బారెడ్డి, తితిదే ఛైర్మన్

తిరుమలలో ప్రారంభించిన అన్న ప్రసాద వితరణ కేంద్రం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.