ETV Bharat / state

నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు..? వాలంటీర్​పై మంత్రి ఫైర్

author img

By

Published : May 17, 2022, 9:06 PM IST

Updated : May 17, 2022, 9:28 PM IST

వాలంటీర్​పై మంత్రి అప్పలరాజు కన్నేర్ర
వాలంటీర్​పై మంత్రి అప్పలరాజు కన్నేర్ర

Minister Appalaraju fire on Volunteer: శ్రీకాకుళం జిల్లా రెంటికోటలో మంత్రి అప్పలరాజు.. గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ వాలంటీర్​పై మంత్రి కన్నెర్రజేశారు. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరంటూ మండిపడ్డారు.

వాలంటీర్​పై మంత్రి అప్పలరాజు ఫైర్

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు.. వాలంటీర్ లోకేశ్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం తరఫున ఏ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగిందో.. ఆ జాబితాను వాలంటీర్లు సిద్ధం చేశారు. కాగా రేణుక బెహర అనే మహిళ ఇంటికి వెళ్లేసరికి వాలంటీర్ సిద్ధం చేసిన జాబితాలో ఆమె పేరు కనిపించ లేదు. వెంటనే వాలంటీర్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. 'ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చారంటూ' మండిపడ్డారు. అలాగే తెలుగుదేశం నాయకులు ఏదైనా కార్యక్రమం చేయడానికి వస్తే ప్రజలు వెళ్తున్నారని.. నువ్వు ఏం చేస్తున్నావని వాలంటీర్​పై కన్నెర్రజేశారు.

ఇదీ చదవండి: వాలంటీర్​పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే.. కారణం అదేనా..?

Last Updated :May 17, 2022, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.