ETV Bharat / state

ఈనెల 9న శ్రీకాకుళం రానున్న సీఎం జగన్..ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

author img

By

Published : Nov 7, 2021, 5:20 PM IST

ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్..ఈనెల 9న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు.

ఈనెల 9న శ్రీకాకుళం రానున్న సీఎం జగన్
ఈనెల 9న శ్రీకాకుళం రానున్న సీఎం జగన్

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ ఈనెల 9న రానున్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి ఆయన హాజరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న క్రీడా మైదానానికి చేరుకొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి బయల్దేరి వెళ్లనున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్, కల్యాణ వేదిక ఏర్పాట్లపై ఆరా తీశారు. అదే రోజు జరిగే వివాహా విందు కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చూడాలన్నారు.

ఇదీ చదవండి

Solar Power From SECI: 2014 నుంచి ఏపీ చేసుకున్న ఒప్పందాల్లో సెకి ఆఫరే తక్కువ: ఇంధన శాఖ కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.