ETV Bharat / state

టీడీపీ, జనసేన పొత్తు కొత్త శకానికి నాంది - రాష్ట్రం నేరస్థులు, హంతకుల చేతిలో ఉంది: బాలకృష్ణ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 6:59 PM IST

Updated : Nov 16, 2023, 10:31 PM IST

TDP and Janasena Coordination Meeting in Hindupuram: తెలుగుదేశం, జనసేన సమన్వయ సమావేశం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించారు. చౌడేశ్వరి కాలనీలోని టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన-టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

tdp_janasena_meeting
tdp_janasena_meeting

TDP and Janasena Coordination Meeting in Hindupuram: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు సమన్వయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, (MLA Nandamuri Balakrishna) జనసేన- టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలు కలవడం సంతోషకరమని.. టీడీపీ- జనసేన పొత్తు (TDP and Jana Sena alliance) కొత్త శకానికి నాంది అని ఇన్నారు. రాష్ట్రంలో పాలన మొత్తం.. నేరస్థులు, హంతకుల చేతిలో ఉందని ఆరోపించారు. హిందూపురంలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు.

TDP Janasena Alliance First Meeting: టీడీపీ-జనసేన 'కీ'లక భేటీ.. విజయమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ..!

Balakrishna visit Hindupuram Government Hospital: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బాలకృష్ణ సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులను వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గుండె చికిత్స విభాగం, అత్యవసర చికిత్స విభాగాలలో పర్యటించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. మాతా శిశు కేంద్రం వద్ద కాన్పు అయిన మహిళలతో ఆసుపత్రిలో సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది రోగులు వారి బంధువులు, స్థానికులు ఆస్పత్రిలో సిటీ స్కాన్ లేక వేలాది రూపాయలు వెచ్చించి బయట చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదు చేశారు.

TDP-JanaSena Coordination Committee: జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీ ఏర్పాటు..

అంతే కాకుండా కాన్పుల వార్డులో ఇద్దరు వైద్యులే ఉండడం వల్ల ఎక్కువ శాతం కాన్పులను అనంతపురానికి రిఫర్ చేస్తున్నారని వాపోయారు. ఆస్పత్రి సూపరింటెండెంట్​తో ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna visited Hindupuram Hospital) సమస్యల గురించి చర్చించారు. హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను నివేదిక రూపంలో తనకు ఇవ్వాలని కోరారు. అనంతరం మాతా శిశు కేంద్రం ముందు సెల్ఫీ తీసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక సమస్యలు నెలకొన్నాయని.. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

TDP-Jana Sena Coordination Committee టీడీపీ - జనసేన పొత్తులో కీలక పరిణామం.. నాదెండ్ల నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు!

టీడీపీ- జనసేన పొత్తు కొత్త శకానికి నాంది.. వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలపై దాడులు పెరిగాయి.. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తెలుగుదేశం, జనసేన పార్టీలు అండగా ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రం సర్వనాశనం అయింది. పాలన మొత్తం.. నేరస్థులు, హంతకుల చేతిలో ఉంది.. హిందూపురంలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు- నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే

టీడీపీ, జనసేన పొత్తు కొత్త శకానికి నాంది - రాష్ట్రం నేరస్థులు, హంతకుల చేతిలో ఉంది: బాలకృష్ణ
Last Updated : Nov 16, 2023, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.