TDP-Jana Sena Coordination Committee టీడీపీ - జనసేన పొత్తులో కీలక పరిణామం.. నాదెండ్ల నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 12:21 PM IST

thumbnail

TDP-Jana Sena Coordination Committee : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలన్నదే లక్ష్యమని ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన కల్యాణ్.. ఆ క్రమంలో వైసీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించిన పవన్ (Pavan).. రాజమహేంద్రవరం జైలులో ములాఖత్ సందర్భంగా పొత్తును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జత కలిసే వైసీపీని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యాన పొత్తు బంధాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేలా తెలుగుదేశం-జనసేన అడుగులు వేస్తున్నాయి.

ఈ నెలలోనే ఇరుపార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నాయి. కమిటీ సభ్యుల నియామకంపై పవన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించి సీనియర్ నేతలతో చర్చించారు. టీడీపీ - జనసేన (Janasena) సమన్వయ బాధ్యతలు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. త్వరలోనే టీడీపీ తరఫున సభ్యుల నియామకం జరగనుంది. తెలంగాణ నుంచీ ఓ సభ్యుడిని నియమించే యోచనలో జనసేన ఉంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)పర్యటన దిల్లీలో కొనసాగుతోంది. రేపు చంద్రబాబుతో ములాఖత్ లో చర్చించిన తర్వాత తెలుగుదేశం సమన్వయ కమిటీ సభ్యులను ఆ పార్టీ ప్రకటించనుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.