ETV Bharat / state

జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు.. భక్తులను తొక్కేసిన భూతప్పలు

author img

By

Published : Dec 10, 2022, 11:33 AM IST

Updated : Dec 10, 2022, 12:03 PM IST

Bhuthappa Utsavalu in Sri Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లాలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. వేడుకల్లో కీలకమైన భక్తులను తొక్కే ఘటనను వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. భూతప్పల కాలి స్పర్శతో కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు.

భూతప్ప  ఉత్సవాలు
భూతప్ప ఉత్సవాలు

Bhuthappa Utsavalu in Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు మూడు రోజుల నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భూతప్పలు భక్తులను కాలితో తొక్కే ఘటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాల ముందు భూతప్పల వేషధారణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు భక్తులపై నడుచుకుంటూ వెళ్లారు. భూతప్పల కాలి స్పర్శతో కోరికలు నెరుగుతాయనే ప్రగాఢ నమ్మకంతో ఉత్సవానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.

శ్రీ సత్య సాయి జిల్లాలో భూతప్ప ఉత్సవాలు

ఇవీ చదవండి:

Last Updated : Dec 10, 2022, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.