ఎలాంటి సమస్యలున్నా చెప్పండి - హిందూపురం నేతలు, కార్యకర్తల సమావేశంలో బాలకృష్ణ

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 8, 2024, 4:00 PM IST

Hindupuram MLA Nandamuri Balakrishna

Hindupuram MLA Nandamuri Balakrishna Meets TDP Activists: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. వారి మస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతల అరాచకాలను బాలకృష్ణ ముందు ప్రస్తావించారు. త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకూ ఓపిక పట్టాలని బాలకృష్ణ కార్యకర్తలకు సూచించారు.

Hindupuram MLA Nandamuri Balakrishna Meets TDP Activists: మూడు రోజుల పర్యటనలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. పట్టణం, గ్రామీణ మండలాల్లో నెలకొన్న సమస్యలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ చర్చించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటుగు పార్టీ పట్టిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తనతో చెప్పాలని, సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు. గ్రౌండ్ లెవల్​లో నేతలు, కార్యకర్తలను సమీకరిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

హిందూపురం నేతలు, కార్యకర్తలతో బాలకృష్ణ భేటీ

సీఎం రేవంత్​కు అఖండ ఆశీస్సులు - మీ మార్క్ పాలనతో తెలంగాణకు శ్రీరామరక్ష

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అంతర్గత సమీక్ష సమావేశాలు నిర్వహించారు. హిందూపురం మండలం పూలకుంట గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో హిందూపురం మండలంలోని 14 పంచాయతీలు ఉండగా, ఒక్కో పంచాయతీ నుండి నాయకులు, కార్యకర్తలతో అంతర్గత సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని విషయాల పైన దిశా నిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల వల్ల ఎదురవుతున్న సమస్యలను వివరించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి బాలయ్య దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరించే దిశగా నియోజకవర్గంలోని నేతలు, కార్యక్తలకు నందమూరి బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను చూసుకుంటానని చెప్పినట్లు కార్యక్తలు తెలిపారు. బాలకృష్ణతో జరిగిన సమీక్ష సమావేశాల అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో గ్రామాలకు తిరిగి వెళ్లారు.

బాలకృష్ణ మరిన్ని రికార్డులు సాధించాలి - అభిమానుల సంబరాలు

ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు రోజుల పాటు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయటంలో భాగంగా ఇప్పటికే చిలమత్తూరు, లేపాక్షి మండలాల కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడతారని తెలిపారు. నేడు పట్టణ సమీపంలోని జేవీఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో హిందూపురం గ్రామీణ మండలానికి చెందిన పార్టీ శ్రేణులతో పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించారు. 9, 10 తేదీల్లో వార్డుల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సమావేశాల కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం సాయంత్రం తన నివాస గృహంలో పట్టణానికి చెందిన కౌన్సిలర్లు డీఈ రమేశ్‌కుమార్‌, నాయకుడు నవీన్‌, సతీశ్‌కుమార్‌, రాఘవేంద్రలతో సమావేశమై పట్టణ సమస్యలపై చర్చించారు. అలాగే పార్టీ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, కొల్లకుంట అంజినప్ప, నాగరాజు, చంద్రమోహన్‌, వెంకటేశ్‌, బేవనహళ్లి ఆనంద్‌తో సమావేశమై పలు విషయాలు చర్చించారు.

హిందూపురంలో బాలకృష్ణ పర్యటన - మార్మోగిన జై బాలయ్య నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.