బాలకృష్ణ మరిన్ని రికార్డులు సాధించాలి - అభిమానుల సంబరాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 7:18 PM IST

thumbnail

Balakrishna Fans Cut A Cake At Kadapa Saibaba Theater: సినీ చరిత్రలో వరుసగా మూడు చిత్రాలు విజయం సాధించిన హీరో నందమూరి బాలకృష్ణకు ఏ హీరో సాటిరారని కడప జిల్లా బాలకృష్ణ సంఘం అసోసియేషన్ అధ్యక్షులు పీరయ్య అన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో కడప సాయిబాబా థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేశారు. అనంతరం సాయిబాబా థియేటర్ లో పనిచేస్తున్న కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. 

సినీ చరిత్రలో ఎన్టీ రామారావు తర్వాత రెండో స్థానాన్ని అధిగమించిన హీరో నందమూరి బాలకృష్ణ మాత్రమేనని కొనియాడారు. ఒకేసారి మూడు సినిమాలు విజయవంతం కావడం అనేది అరుదైన ఘటనని చెప్పారు. అలానే పవిత్రమైన క్రిస్మస్ పండగ సందర్భంగా కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రికార్డులు సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా ఒక నందమూరి వంశానికే సాధ్యమవుతుందని అభిమానులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి రికార్డులు బాలకృష్ణ మరెన్నో సాధించాలని దేవున్ని ప్రార్థిస్తున్నామని అభిమానులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.