ETV Bharat / state

దక్షిణాదిన ప్రసిద్ధికెక్కింది... నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది!

author img

By

Published : Aug 19, 2019, 10:45 AM IST

Updated : Aug 19, 2019, 10:54 AM IST

దక్షిణాదిన ప్రసిద్ధికెక్కింది... నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది!

దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక సెజ్‌గా పేరొందిన ప్రకాశం జిల్లా గ్రానైట్‌ పరిశ్రమ నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు కళకళలాడిన పరిశ్రమ ఇప్పుడు వెలవెలబోతోంది. ఇంతకీ అక్కడ "గ్రానైట్" కుదేలవడానికి కారణమేంటంటే..!?

దక్షిణాదిన ప్రసిద్ధికెక్కింది... నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది!

ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌... ఖరీదైన గ్రానైట్‌గా ప్రసిద్ధి చెందింది. రెండు దశాబ్దాల నుంచి అనేక పరిశ్రమలు, స్థానిక వ్యాపారులు... ప్రభుత్వం నుంచి ఈ గ్రానైట్‌ కొండలను లీజుకు తీసుకుని... దాదాపు 40 గ్రానైట్‌ క్వారీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన రాళ్లను పాలిష్‌ చేసేందుకు... పాలిషింగ్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. బల్లికురవ ప్రాంతంలోనూ గ్రానైట్‌ క్వారీలు ఉండటం వల్ల... 15 ఏళ్ల క్రితం గుళ్లాపల్లి వద్దఉన్న గ్రోత్‌ సెంటర్‌ వద్ద... భవన నిర్మాణ ముడిసరకు ఎస్‌.ఈ.జెడ్‌ ఏర్పాటు చేశారు. ఈ తరహా ఎస్‌.ఈ.జెడ్‌ దక్షిణ భారత్‌లో ఇదొక్కటే.

12 వరకూ అతిపెద్ద గ్రానైట్‌ యూనిట్లు ఉండటం వల్ల.. పదివేల మంది కార్మికులకు ఉపాధి లభించేది. చిన్న పరిమాణాల్లో పలకలు కోసే 90 యూనిట్లు ఉన్నాయి. కాలక్రమంలో క్వారీలకు అతి సమీపంలో చీమకుర్తి, మార్టూరు ప్రాంతాల్లోనే పాలిష్‌ యూనిట్లు ఏర్పడ్డాయి. క్వారీల్లో ఉత్పత్తి అవుతున్న ముడిసరుకు నేరుగా వీటికే వెళ్తోంది. దీని వల్ల... క్వారీల మీదే ఆధారపడి గ్రోత్‌ సెంటర్‌ వద్ద ఏర్పడిన పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా తగ్గిపోయింది. దీనికితోడు రవాణా ఛార్జీల భారంతో ఎక్కువ ధరకు గ్రానైట్‌ పలకలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో నెలకు 4వేల కంటైనర్లతో పాలిషింగ్‌ పలకలు అమెరికా సహా అనేక దేశాలకు ఎగుమతయ్యేవి. ఇప్పుడు 7 వందల కంటైనర్లకు మించి వెళ్లట్లేదని యజమానులు ఆవేదన చెందుతున్నారు.

సెజ్, గ్రోత్ సెంటర్లో ఉన్న మధ్య, భారీ పరిశ్రమల్లో పనిగంటలు తగ్గడం, కొన్ని పరిశ్రమలు మూతపడటంతో.... కార్మికులు, ఉద్యోగులు కష్టాల్లో పడ్డారు. స్థానికంగా ఉత్పత్తయ్యే ముడి రాయి కనీసం 50 శాతమైనా స్థానిక పాలిషింగ్‌ యూనిట్లకు విక్రయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పరిశ్రమల మనుగడ సాగుతుందని పాలిషింగ్‌ యూనిట్ల యజమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి..

శ్రీనగర్​లో నేడు పాఠశాలల పునఃప్రారంభం

Intro:thagginakrishna


Body:vardha


Conclusion:perigina kastalu కృష్ణానది కే ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గటంతో వరద సైతం తగ్గుముఖం పట్టింది నాలుగు రోజులుగా గా భారీగా రావటంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ప్రస్తుతం నీటి ప్రవాహం తగ్గినప్పటికీ వేలాది ఎకరాల్లో ముంపునకు గురైన పత్తి ఓరి కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి రోడ్లు సైతం కావడంతో రాకపోకలు సైతం ఇబ్బందిగా మారింది పరిటాల రోడ్ల మధ్య నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రోడ్డు ధ్వంసమైంది ది ది లంక గ్రామాల ప్రజలు తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు పూర్తిగా దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు
Last Updated :Aug 19, 2019, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.