ETV Bharat / state

'కుళ్లిపోయిన కాయలను, చెత్త చెదారాలను తీసేయండి'

author img

By

Published : Aug 17, 2020, 4:50 PM IST

high school grounds  damaged  at cheerala
చీరాలలో ఉన్నతపాఠశాల మైదానం

కరోనా దెబ్బకు ఉన్నత పాఠశాల మైదానం పాడవుతోందని ప్రకాశం జిల్లా చీరాలలోని క్రీడాభిమానులు, వాకర్స్ ఆవేదన చెందుతున్నారు. మైదానంలో కుళ్లిపోయిన కాయలను, చెత్త చెదారాలను ఎప్పటికప్పుడు తీసేసి... శుభ్రం చేయాల్సిందిగా క్రీడాభిమానులు కోరుతున్నారు.

కరోనా దెబ్బకు ఉన్నతపాఠశాల మైదానం పాడవుతోందని ప్రకాశం జిల్లా చీరాలలోని క్రీడాభిమానులు, వాకర్స్ ఆవేదన చెందుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున .. చీరాల హోల్సేల్ కూరగాయల మార్కెట్​ను, కొత్తపేట బైపాస్ రహదారిలో, పండ్ల మార్కెట్​ను పట్టణంలోని మున్సిపల్ బాలుర ఉన్నతపాఠశాల మైదానంలో అధికారులు ఏర్పాటు చేశారు.

మైదానంలో కోసేసిన అరటి గెలలు, కుళ్లిపోయిన కాయలు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. గత రెండు రోజులుగా చీరాలలో తేలికపాటి వర్షం కురిసిన కారణంగా.. ఆ ప్రాంతమంతా చిత్తడిగా మారింది. ఈ పరిస్దితి ఇలా ఉంటే... వ్యాధులు వస్తాయని భయపడుతున్నారు. మైదానంలో కుళ్లిపోయిన కాయలను, చెత్త చెదారాలను ఎప్పటికప్పుడు తీసేసి... శుభ్రం చేయాల్సిందిగా క్రీడాభిమానులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తెదేపా నేత నారా లోకేశ్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.